పండగ చేసుకోండి..! కూలీ రిలీజ్.. సెలవు‌తో పాటు ఫ్రీగా టికెట్స్ ఇచ్చిన సంస్థ.. ఎంప్లాయిస్ ఫుల్ హ్యాపీ.

coolie-9

ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా రెండు భారీ బడ్జెట్‌ సినిమాలు కూలీ, వార్‌2 సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. రజనీకాంత్, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలు కావడంతో ఈ సినిమాలపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్ లో ఈ సినిమాల టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

ఇండియా వైడ్ గా ఉన్న సినీ లవర్స్ అందరూ ఇప్పుడు ఆగస్టు 14కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ గురువారం రెండు బడా సినిమాల రిలీజ్ అవుతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాతో పాటు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమా విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. బుకింగ్స్ లోనూ ఈ సినిమాలు పోటీపడుతున్నాయి. రెండు సినిమాలకు భారీగా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇక కూలీ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా మంది నటిస్తున్నారు. కన్నడ నుంచి ఉపేంద్ర, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, మలయాళం నుంచి శోబిన్ , టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున నటిస్తున్నారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights