Coolie vs War 2 first reactions: థియేటర్లలోకి వార్ 2, కూలీ.. ఎవరిది పైచేయి? జనం ఎవరికి జై కొట్టారంటే?

war1-1755155742

బాక్సాఫీస్ వద్ద అసలు సిసలు సమరానికి ఆగస్ట్ 14 వేదికైంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం వార్ 2తో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ ఒకే రోజు రిలీజ్ కావడంతో ఈ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందు నుంచే టీజర్, ట్రైలర్లతో ఈ రెండు సినిమాలపై భారీ హైప్ నెలకొంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ కూలీ, వార్ 2 పోటీపడ్డాయి. ఆగస్ట్ 14 రానే వచ్చింది.. రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. యూఎస్ ప్రీమియర్స్, బెనిఫిట్ షోలతో ఆగస్ట్ 13వ తేదీ రాత్రే టాక్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో కూలీ, వార్ 2లలో ఏ సినిమా పైచేయి సాధించింది? అనే క్యూరియాసిటీ నెలకొంది. ఈ వివరాల్లోకి వెళితే.. కూలీ vs వార్ 2 కూలీ, వార్ 2 రెండు సినిమాలు ఆగస్ట్ 14న వస్తున్నాయని తెలిసినప్పటి నుంచి పోటీ మొదలైంది. ప్రీ రిలీజ్ బిజినెస్, థియేటర్లు, అడ్వాన్స్ బుకింగ్, ప్రీమియర్ ప్రీ సేల్స్ ఇలా ప్రతి విషయంలోనూ రెండు సినిమాలను పోల్చి చూశారు ప్రేక్షకులు. ఇక మీడియా దెబ్బకి ఒక దశలో నార్త్ సినిమా, సౌత్ సినిమా అన్న ఫీలింగ్ కూడా వచ్చేసింది. ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ రెండు సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్‌లో జరిగింది. కూలీ, వార్ 2 చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

కూలీ మూవీ ట్విట్టర్ రివ్యూ లోకేష్ వ్యూహం లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీ చిత్రం రజనీకాంత్ కెరీర్‌లోనే ఓ మైలురాయి కానుంది. దీనికి కారణంగా ఆయన సినీ జీవితం 50 ఏళ్లు పూర్తి చేసుకోవడమే. అక్కినేని నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ వంటి స్టార్స్ కారణంగా కూలీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ క్యాస్టింగ్‌తో భారీ హైప్ తీసుకురావడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు. భారీ స్టార్ క్యాస్టింగ్‌తో వచ్చే ప్రయోజనాలు చాలానే ఉంటాయని గతంలోనే విశ్లేషకులు అనాలిసిస్ చేశారు. అన్ని భాషల హీరోలకు స్థానం ఇవ్వడం వల్ల వారి వారి అభిమానులను ఈ సినిమా వైపు ఆకర్షించవచ్చని లోకేష్ కనగరాజ్ వ్యూహాత్మకంగా వెళ్లాడు. కూలీ, వార్ 2అడ్వాన్స్ బుకింగ్‌ వార్‌తో పోటీ ఉన్నప్పటికీ కూలీ.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా ఏకంగా 12 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దాంతో తొలిరోజే కూలీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల రూపాయలకు పైగా ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. వార్ 2 నార్త్ ఇండియాలో డామినేషన్ చూపిస్తుండగా.. తెలుగులో బుకింగ్స్ సమయాలు ప్రకటించిన తర్వాత వార్ 2కి అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగాయి. వార్ 2కి తొలి రోజు 100 కోట్ల రూపాయలకు పైగా ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. వార్ 2, కూలీలు రిలీజ్ కాగా ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. వీటిని ఒకసారి పరిశీలిస్తే..

War 2 Vs Coolie: వార్ 2 షోస్ క్యాన్సిల్.. కూలీకి థియేటర్ల కేటాయింపు.. రజనీ హై ఫీవర్ మానియా! స్క్రీన్ ప్లే, మ్యూజిక్, డైరెక్షన్, నటీనటుల పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ తమ బాధ్యతను నిర్వర్తించారని ఓ అభిమాని కూలీకి అదిరిపోయే రివ్యూ ఇచ్చారు. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య కెమిస్ట్రీ బాగుంది. సినిమా గ్రాండీయర్‌గా, స్టైలీష్‌గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లు, ఫస్టాఫ్‌లో ఫన్ అండ్ ఎనర్జీ బాగున్నాయి. నెక్ట్స్ ఏం జరుగుతుందో చెప్పేలా కథ ఉంది. సెకండాఫ్ స్లోగా ఉంది, వీఎఫ్ఎక్స్ అస్సలు బాలేదని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights