తెలంగాణలో 50వేలు దాటిన కరోనా కేసులు

*తెలంగాణలో 50వేలు దాటిన కరోనా కేసులు*
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 662 కేసులు నమోదు కాగా..
రంగారెడ్డి జిల్లాలో 213 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50,826కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 39,327 మంది బాధితులు కోలుకున్నారు. 1,567మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ తొమ్మిది మంది మృతి చెందడంతో ఇప్పటి వరకు మొత్తం 447మంది కరోనా కాటుకు ప్రాణాలు విడిచారు. ఇవాళ 13,367 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
