టాయిలెట్ ద్వారా కరోనా ఎలా వ్యాపిస్తుంది?

Spread the love

కరోనా వైరస్ వచ్చి నెలలు గడిచిపోతున్నాయి. వైరస్ పై ప్రపంచం పోరాడుతూనే ఉంది. కానీ కంటికి కనిపించని ఆ వైరస్ ప్రపంచ మేధావులకు కూడా అంతుచిక్కటం లేదు. ఉపరితల వస్తువులపైనే కరోనా ఉంటుందని మొదట చెప్పిన వారే. లేదు లేదు ఇప్పుడు గాల్లో కూడా వైరస్ ప్రయాణించగలదని హెచ్చరిస్తున్నారు.

ఓ ఇంట్లో కోవిడ్ పేషెంట్ ఐసోలేషన్ లో ఉన్నా.. ఆ ఇంట్లో వారంతా కరోనా బారిన పడే అవకాశం చాలా ఎక్కువ. మరీ పట్టణ ప్రాంతాల్లో ఉన్న భారీ అపార్ట్మెంట్స్ అయితే.? కింద ఫ్లోర్ లో ఉన్న వ్యక్తికి కరోనా వైరస్ ఉంటే పక్కనున్న వారికి, పై నుండే వారికి వైరస్ బారిన పడే అవకాశాలుంటాయా.? అన్న అనుమానాలు కామన్.

కానీ వారికి కూడా ముప్పే అంటున్నారు నిపుణులు.

పైగా అవి నేరుగా గాలి ద్వారా కాకుండా మనం వాడే టాయిలెట్స్ ద్వారా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బహుళ అంతస్తుల అపార్ట్మెంట్స్ ఉంటే రిస్క్ మరీ ఎక్కువ అని సూచిస్తున్నారు.

టాయిలెట్ ద్వారా కరోనా ఎలా వ్యాపిస్తుంది?

మన కింద ఫ్లోర్ లో ఉన్న వ్యక్తి కరోనా బాధితుడు అయితే. తను వాడిన టాయిలెట్ చాలా ప్రమాదకరంగా మారనుంది. మన టాయిలెట్ వ్యవస్థ అంతా పైపులతోనే. ఆ పైపులలో ఎక్కువగా యూ టైప్ బెండ్స్ ఉంటాయి. ఆ బెండ్స్ లో టాయిలెట్ వాటర్ కొంతైనా ఉంటుంది. మనం ఎంత ప్లష్ చేసినా ఆ బెండ్ లో వాటర్ పూర్తిగా వెళ్లదు. ఇప్పుడా ఆ బెండ్ వల్లే కరోనా ఆ పై ఫోర్ లో ఉన్న వారికి సోకే ప్రమాదం ఉంది.

కరోనా వైరస్ గ్రూప్ కే చెందిన సార్స్ వైరస్ గతంలో ఎంత భయపెట్టిందో అందరికీ తెలుసు. హాంకాంగ్ లోని ఓ 50అంతస్థుల భవన సముదాయం అయిన అమోయ్ గార్డెన్స్ లో ఓ బాధితుడు రెగ్యూలర్ గా తన టాయిలెట్ వాడాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ పై అంతస్తుల వారికి కూడా వ్యాధి సోకంది. కారణం ఏంటీ అని ఆరా తీయగా టాయిలెట్ వల్లే అని తెలింది. ఇటు కరోనా విషయంలోనూ ఇదే జరిగింది.

మనం వాడే టాయిలెట్ బెండ్ లో టాయిలెట్ వాటర్ కాస్త నిల్వ ఉంటుంది. మనం ఆ టాయిలెట్ ను కొన్ని రోజులు వాడటం మానేస్తే. ఆ బెండ్ పూర్తిగా ఎండిపోతుంది. కానీ అక్కడ చెడు వాసనలు మొదలవుతాయి. ఆ వాసనలు పై ఫోర్లలో ఉండే అదే లైన్ వారి టాయిలెట్ లో కూడా వస్తుంది. ఆ వాసనతోనే ఇలాంటి సార్స్ గ్రూప్ కు చెందిన వైరస్ లు కూడా ప్రయాణిస్తాయి. కాబట్టి మనం మన ఇంట్లో సేఫ్ గా ఉన్నాం కదా అని నిర్లక్ష్యం చేయకుండా. టాయిలెట్స్ ను రెగ్యూలర్ గా శుభ్రం చేయటం, క్యాప్ పెట్టి ప్లష్ చేయటం, క్యాప్ తో ఉన్న టైంలో ప్లష్ చేసిన తర్వాతే టాయిలెట్ ను వాడటం మంచివని నిపుణలు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *