విటమిన్ డి ఉన్నవారు త్వరగా కోలుకుంటున్నారు

Spread the love

విటమిని డి లోపం ఉన్నవారు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని.. కరోనాతో మరణిస్తున్న రోగుల్లో డి. విటమిన్ లోపం ఉంటోందని వైద్యులు చెప్పటం ఇప్పడు కలవర పరుస్తోంది. విటమిన్ డి సమృధ్ధిగా ఉన్నవారికి కరోనా సోకినా వారు త్వరగానే కోలుకుంటున్నట్లు రికార్డులు చెపుతున్నాయి.

సూర్యరశ్మి తగలకుండా ఇళ్లు, కార్యాలయాలకే పరిమితమయ్యే నగర వాసుల్లో సుమారు 80 శాతం మందిలో డి-విటమిన్‌ లోపం ఉంటోందని పలు సర్వేలు చెపుతున్నాయి.
కాగా హైదరాబాద్ గ్రేటర్‌ వాసులు ఎక్కువ మంది కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. డి-విటమిన్‌ తక్కువగా ఉన్న వారిలో రోగనిరోధక శక్తి సన్నగిల్లుతుందని.కరోనా మృతుల్లో అధిక శాతం వారేనని.సమృద్ధిగా ఉన్న వారు త్వరగా కోలుకుంటున్నారని హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ వెంకటి తెలిపారు.

సైటోకీన్స్‌ను క్రమబద్ధ్దీకరిస్తుంది
నగరంలో ప్రతి 100 మందిలో 70 నుంచి 80 మందిలో విటమిన్‌ డి లోపం ఉందని వివిధ సర్వేల్లో తేలింది. సాధారణంగా రోగిలో ఏదైన వైరస్‌ సోకినప్పుడు సైటోకీన్స్‌ అనేవి సైనికుల్లా పనిచేసి శరీరంలోకి వచ్చిన శత్రువుల్లాంటి వైరస్‌లపై దాడిచేసి వాటిని నశింపచేస్తాయి.

కానీ మిటమిన్‌ డి లోపం ఉన్నవారిలో రోగిని వైరస్‌ నుంచి కాపాడాల్సిన ఈ సైటోకీన్సే ఎదురుదాడి చేసి శరీరంలోని ఇతర మూలకణాలను దెబ్బతీస్తాయి. దాని వల్ల రోగిలో రక్త కణాలు దెబ్బతిని గుండె, కిడ్నీలు, కాలేయం వంటి ప్రధాన అవయవాలు విఫలమవుతాయి. ఇది జరగకుండా సైటోకీన్స్‌ అనేవి సక్రమంగా పనిచేయాలంటే విటమిన్‌ డి అవసరం.

విటమిన్ డి ఉన్నవారు త్వరగా కోలుకుంటున్నారు
ప్రస్తుతం హైదరాబాద్ లో నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే విటమిన్‌ డి లోపం ఉన్నవారే ఎక్కువగా కొవిడ్‌ వైరస్‌ బారినపడుతున్నారని డా.వెంకటి చెప్పారు. అలాగే మృతుల్లోనూ ఈ విటమిన్‌ లోపం ఉన్నవారే అధికంగా ఉంటున్నారు. ఈ విటమిన్‌ సమృద్ధిగా ఉన్నవారు త్వరగా కోలుకుంటున్నారు. వారిలో రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటోంది.

సాధారణంగా విటమిన్‌ డి లోపం వల్ల ఎముకలు, కండరాలు పటుత్వం కోల్పోవడం, గుండె వ్యాధులు, శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. సూర్య కిరణాలతో పాటు చేపలు, గుడ్లు, వెన్న, పాలు తదితర వాటిలో డి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. లోపం ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యుడి సలహా మేరకు తక్కువ డోస్‌లో కొంత కాలం పాటు విటమిన్‌ డి మాత్రలను వినియోగించడం మంచిది. కనీసం అరగంట ఎండలో ఉంటే సహజంగా ఇది లభిస్తుందని ఆయన సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *