భర్తను చంపేందుకు భార్య మాస్టర్ స్కెచ్.. కూరలో వయాగ్రా మాత్రలు.. ఆ తర్వాత సీన్ ఇది..

crime

ఇటివల కాలంలో భార్యలు.. భర్తలను చంపుతున్న కేసులు పెరిగిపోతున్నాయి. కుటుంబ కలహాలతో పాటుగా అక్రమ సంబంధాల కారణంగా భర్తలను అత్యంత దారుణంగా చంపేస్తున్న ఘటనలు చాలా తెరపైకి వస్తున్నాయి.. తాజాగా కరీంనగర్‌లో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది.

ఇటివల కాలంలో భార్యలు.. భర్తలను చంపుతున్న కేసులు పెరిగిపోతున్నాయి. కుటుంబ కలహాలతో పాటుగా అక్రమ సంబంధాల కారణంగా భర్తలను అత్యంత దారుణంగా చంపేస్తున్న ఘటనలు చాలా తెరపైకి వస్తున్నాయి.. తాజాగా కరీంనగర్‌లో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. చెడు వ్యసనాలకు అలవాటు పడి మరో ఐదుగురు‌ సహాయంతో భర్తను అత్యంత దారుణంగా మర్డర్ చేయడం కలకలం రేపింది.. వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీలో కత్తి సురేష్, మౌనిక నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరూ పిల్లలు.. పదేళ్ళ క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. సురేష్ టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య విభేధాలు పెరిగిపోయాయి. దానికి తోడు మౌనిక చెడు అలవాట్లకి బానిసగా మారింది. ఈ క్రమంలో భార్య భర్తల మధ్య తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. సురేష్ ని హత్య చేయాలని ఫ్లాన్ చేసింది. దీని కోసం ఆమెకు తెలిసిన మరో ఐదుగురి సహాయం తీసుకుంది. తన బంధువు అయినా అరిగే శ్రీజకు తన ప్లాన్ చెప్పింది.. ఆమె మెడికల్ ఏజెన్సీ యజమాని పోతు శివకృష్ణ మరో‌ స్నేహితురాలు‌ సంధ్యను మౌనికకి పరిచయం చేసింది. వీరంతా కలిసి సురేష్ ని హత్య చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.

మెడికల్ ఏజెన్సీ యజమాని శివకృష్ణ వయాగ్రా, బిపి మాత్రలతో సురేష్ ని చంపవచ్చని వారికి సూచించారు.. దీనితో మెడికల్ షాపులోకి వెళ్ళి పదిహేను వయగ్రా మాత్రలు తీసుకువచ్చారు. మౌనిక ఈ టాబ్లెట్స్ ని‌ కూరలో కలిపింది. తరువాత సురేష్ అన్నం తినే సందర్భంలో సురేష్ కి కూరలో వాసన రావడంతో తినకుండా అక్కడ ప్లేట్ వదిలేసి వెళ్ళిపోయాడు.. దీనితో మొదటి ప్లాన్ ఫెయిల్ అయ్యింది.. రెండవ ప్లాన్లో భాగంగా బిపి టాబ్లెట్స్ లతో పాటుగా నిద్రమాత్రలని చూర్ణం చేసి మద్యంలో కలిపి సురేష్ ఇచ్చింది మౌనిక.. తాగిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. తరువాత చీరెని ఒకప్రక్క కిటికి గ్రిల్ కి కట్టి మరోప్రక్క సురేష్ మెడకి బిగించి ఉరేసి చంపింది..

అయితే మౌనిక ఈ హత్యని‌ కప్పి పుచ్చుకోవాడానికి సురేష్ లైంగిక చర్య సమయంలో‌ సృహ కోల్పోయడని అత్తమామలకి ఫోన్ చేసి చెప్పింది. ఆసుపత్రికి తీసుకు వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నానని మరో నాటకం ఆడింది. అప్పటికే సురేష్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సాధారణ మరణంగానే నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ కొందరు పోలిస్ స్టేషన్ లో కేసు పెడితే ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు వస్తాయని సలహ ఇచ్చారు. దీంతో టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

ఈ క్రమంలోనే.. మౌనిక తీరు, వ్యవహారంపై అనుమానాలు కలగడంతో.. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టడంతో సురేష్ ని ప్రక్క ప్లాన్ ప్రకారమే హత్య చేసారని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యకి కారణం అయిన మౌనికతో పాటుగా ఆమెకి‌ సహకరించిన నిందితులు శ్రీజ, శివకృష్ణ, అజయ్, సంధ్య దేవదాసులని అరెస్టు చేసి రిమాండ్ కి పంపించారు. ఈ హత్య కి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించిన కరీంనగర్ సిపి గౌస్ అలం.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights