డెకాయిట్ ఫస్ట్ వీకెండ్… కలెక్షన్స్‌లో అడివి శేష్ దూసుకెళ్తున్నాడు!

Dacoit సినిమా విడుదలైన తొలి రోజుల్లో మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి స్థిరత్వాన్ని చూపిస్తోంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఫస్ట్ వీకెండ్‌లో సాలిడ్ కలెక్షన్స్ సాధించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా మూడో రోజు కూడా కలెక్షన్స్ తగ్గకుండా కొనసాగడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. వీకెండ్ కలెక్షన్స ఇండియా గ్రాస్: రూ.23.12 కోట్లు…
గడిచిన 24 గంటల్లో లక్షకు పైగా టికెట్లు అమ్ముడవడం ఈ సినిమాకు ఉన్న డిమాండ్‌ను చూపిస్తోంది. వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా ఇదే రీతిలో వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
హిందీ మార్కెట్‌లో పోటీ ఉన్నప్పటికీ, డెకాయిట్ తన స్థిరత్వాన్ని నిలబెట్టుకుంది. యూత్ మరియు మాస్ ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంటోంది. టాక్ ఉన్నప్పటికీ కలెక్షన్స్ పరంగా డెకాయిట్ మంచి రన్ కొనసాగిస్తోంది. ఇదే జోరు కొనసాగితే ఈ సినిమా హిట్ దిశగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్–విజయవాడకు ‘ఫ్లై 91’ ఫ్లైట్ స్టార్ట్… గంటలోనే ప్రయాణం!
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
