రక్షాబంధన్ సందర్భంగా వరాల జల్లు కురిపించిన సీఎం

Delhi CM Arvind Kejriwal

Teluguwonders:

సీఎం రక్షాబంధన్ కానుక.. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం..

రక్షాబంధన్ పండుగ సందర్భంగా రాష్ట్ర మహిళలకు వరం ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు వారిపై వరాల జల్లు కురిపిస్తున్నారు ఢిల్లీ సీఎం. మహిళలకు ఢిల్లీ మెట్రో సర్వీసులు, బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని రెండు నెలల కిందే ప్రకటించారు కేజ్రీవాల్. ఆ మేరకే పథకం అమలుపై తాజాగా నిర్ణయం తీసుకున్నారు.అంతేకాదు ఢిల్లీలో ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఇటీవల ఢిల్లీ సీఎం ప్రకటించారు.

👉మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం:

🔴 ఢిల్లీ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం:

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కొద్ది రోజులుగా ఢిల్లీ వాసులపై వరాలు కురిపిస్తున్న ఆయన రక్షాబంధన్ పండుగ సందర్భంగా వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని మహిళలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపి, ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
వచ్చే అక్టోబర్ 29 నుంచి ఈ పథకాన్ని పూర్తీ స్థాయిలో అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ఢిల్లీ మెట్రోల్లో, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటును కల్పిస్తామని రెండు నెలల క్రితం చేసిన ప్రకటన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సుల్లో రాష్ట్రంలోని మహిళందరూ ఉచితంగా ప్రయాణించొచ్చని పేర్కొన్నారు.

🚌ప్రత్యేకించి ఆగస్టు 15న :

ఆగస్టు 15న ఢిల్లీ రవాణా సంస్థ (DTC)కు చెందిన అన్ని ఏసీ, నాన్‌ ఏసీ బస్సుల్లో మహిళలందరూ ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు.

🔴కారణం ఏమిటంటే:

ఢిల్లీ పరిధిలో డీటీసీ బస్సులు సహా మెట్రో రైళ్లలో మహిళలకు పూర్తిగా ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ రెండు నెలల కిందట ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనివల్ల మహిళలు సులభంగా ఏ ఆటంకం లేకుండా పూర్తి భద్రతతో ఎంత దూరమైనా ప్రయాణించవచ్చని కేజ్రీవాల్ తెలిపారు. ఎక్కువ ప్రయాణ ఛార్జీల వల్ల కొందరు మహిళలు, యువతులు కొన్ని రకాల రవాణా సాధనాలకే పరిమితమవుతున్నారని అన్నారు. ఈ ప్రతిపాదన సాధ్యా సాధ్యాలపై సమీక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

మరోవైపు యూపీ ప్రభుత్వం కూడా రక్షాబంధన్ రోజున మహిళలకు ఉచిత రవాణా సౌకర్ణాయాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని అన్ని ఏసీ,నాన్ ఏసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని యోగి సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే

💥ఫ్రీ వైఫై సౌకర్యం కూడా :

సీఎం కేజ్రీవాల్.. ఢిల్లీ వాసులకు ఫ్రీ వైఫై సౌకర్యాన్ని కల్పిస్తామంటూ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి పౌరుడికి 15 జీబీ డేటా ద్వారా ఉచిత ఇంటర్నెట్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. రానున్న మూడు లేదా నాలుగు నెలల్లో మొదటి విడతలో భాగంగా నగర వ్యాప్తంగా కనీసం 11 వేల వైఫై హాట్‌స్పాట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 70 అసెంబ్లీ కేంద్రాల్లో ఒక్కోదాంట్లో 1000 హాట్‌స్పాట్లతోపాటు బస్ స్టేషన్‌లలో మరో 4000 కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.నగరవాసులకు ప్రతి నెలా 15 జీబీ డేటాను అందిస్తామని.. అందుకోసం నగర వ్యాప్తంగా 11 వేల హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. మరో 4 నాలుగు నెలల్లో ఈ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights