Whatsappలో వినూత్నంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా!

0

మరికొద్ది రోజుల్లో రానున్న దీపావళి పండుగ ఆనందాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే వాట్సాప్ స్టిక్కర్లను ఉపయోగించడం ద్వారా వినూత్నంగా వారికి శుభాకాంక్షలు తెలపండి.

దీపావళి పండగ వచ్చిందంటేనే అందరిలో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఎందుకంటే దీపావళి అంటేనే జీవితాల్లో వెలుగులు నింపే పండుగ. ఈ దీపావళి రోజు మన సంతోషాన్ని శుభాకాంక్షలు తెలపడం ద్వారా స్నేహితులు, కుటుంబసభ్యులతో పంచుకోవాలనుకుంటాం. మరి ఎప్పటిలాగానే తెలుగులో దీపావళి శుభాకాంక్షలు అనో, ఇంగ్లీష్ లో హ్యాపీ దీపావళి అనో శుభాకాంక్షలు తెలిపితే కిక్ ఏముంటుంది? అందుకే వాట్సాప్  లో వినూత్నంగా స్టిక్కర్ల ద్వారా శుభాకాంక్షలు తెలపండి. ఎలా అంటారా? కింద చెప్పిన ప్రక్రియని యథావిధిగా ఫాలో అయిపొండి.

వాట్సాప్ లో ఉన్న స్టిక్కర్ ఆప్షన్ ద్వారా మీరు దీపావళి స్టిక్కర్లను పంపించవచ్చు. అయితే ఆ వాట్సాప్ స్టిక్కర్లను ఇలా పొందండి..

మీది ఆండ్రాయిడ్ ఫోన్ అయితే..

❂ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘Personal Stickers For Whatsapp’ అనే యాప్ ని డౌన్ లోడ్ చేసుకోండి.

❂ అనంతరం మీరు వాట్సాప్ ని ఓపెన్ చేస్తే ఎవరికి మెసేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ల చాట్ ఓపెన్ చేసి కీబోర్డ్ ఓపెన్ చేయండి.

❂ పక్కనే కనిపించే స్మైలీ బటన్ పై క్లిక్ చేస్తే.. కింద మీకు స్మైలీ, జిఫ్, స్టిక్కర్ ఆప్షన్లు కనిపిస్తాయి. స్టిక్కర్ల మీద క్లిక్ చేస్తే కుడివైపు మీకు ఒక + బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు స్టిక్కర్లను యాడ్ చేసుకోవచ్చు.

❂ అక్కడ మీరు దీపావళి స్టిక్కర్లను యాడ్ చేసుకుని మీకు నచ్చినవారికి పంపించవచ్చు.

మీది ఐఫోన్ అయితే..

ఈ స్టిక్కర్ ఆప్షన్ ఐఫోన్ యూజర్లకు నేరుగా లేదు. మీకు ఆండ్రాయిడ్ యూజర్లు ఎవరైన పంపించిన స్టిక్కర్లను మీరు మీకు నచ్చిన వ్యక్తులకు పంపించుకోవచ్చు.

స్టిక్కర్ మేకర్ యాప్ ద్వారా స్టిక్కర్లను ఇలా రూపొందించండి..

❂ ముందుగా గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి ‘Sticker Maker For Whatsapp’ అనే యాప్ ని డౌన్ లోడ్ చేయండి.

❂ అందులో న్యూ స్టిక్కర్ ప్యాక్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

❂ అక్కడ స్టిక్కర్ ప్యాక్ పేరును, ఇతర సమాచారాన్ని అందించండి. ఈ యాప్ ద్వారా మీరు ఉపయోగించిన స్టిక్కర్లు మరొకరు ఉపయోగించలేరు.

❂ అందులో కనిపించే న్యూ లిస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే.. స్టిక్కర్ ట్రేతో కూడిన మరో పేజీ ఓపెన్ అవుతుంది.

❂ అక్కడ స్టిక్కర్ ప్యాక్ ఐకాన్ ను యాడ్ చేసి అక్కడ కొత్త కస్టమైజ్డ్ స్టిక్కర్ ను యాడ్ చేయడానికి నెక్స్ట్ ట్రేపై క్లిక్ చేయండి.

❂ అనంతరం ఆ ప్యాక్ మీ గ్యాలరీలో ఉన్న ఫొటోలను ఎంచుకోమని లేదా కొత్త ఫొటోలు తీసుకోమని కోరుతుంది.

❂ మీరు ఫొటోని ఎంచుకున్న తర్వాత ఆ ఫొటో ఇమేజ్ ఎడిటర్ కి అప్ లోడ్ అవుతుంది.

❂ మీరు అనుకున్నట్లుగా స్టిక్కర్లు రావడానికి మీరు ఆ ఫొటోలను క్రాప్ కూడా చేసుకోవచ్చు.

❂ ఫొటో సేవ్ అయిన అనంతరం కస్టమ్ స్టిక్కర్ కోసం మీరు ఈ ఆప్షన్ ని మళ్లీ ఉపయోగించండి.

 

Leave a Reply