డిజిటల్‌ లావాదేవీల్లో హైదరాబాద్‌ సెకండ్‌….

0

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: 

డిజిటల్‌ లావాదేవీల్లో బెంగళూరు తర్వాత హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉందని, రాష్ట్రాల వారీగా జాబితా చూస్తే కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు తర్వాత తెలంగాణ ఐదో స్థానంలో ఉందని రేజర్‌పే సీటీఓ అండ్‌ కో–ఫౌండర్‌ శశాంక్‌ కుమార్‌ తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, పాల్వంచ నుంచి లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. బుధవారమిక్కడ రేజర్‌ పే మూడవ ఎడిషన్‌ నివేదికను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత త్రై మాసికంతో పోలిస్తే హైదరాబాద్‌లో ఈ త్రైమాసికంలో కార్డుల వినియోగం 11 శాతం తగ్గిందని, యూపీఐ లావాదేవీలు 58% వృద్ధి చెందాయని తెలిపారు. ఆన్‌లైన్‌ లావాదేవీల్లో ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్, యుటిలిటీస్‌ విభాగాలు 51% వాటాను కలిగి ఉందని పేర్కొన్నారు. జొమోటొ, బుక్‌మై షో, ఎయిర్‌టెల్‌ వంటి 6 లక్షల వ్యాపారస్తులు తమ సేవలను వినియోగించుకుంటున్నారని, 2020 నాటికి 10 లక్షలను లకి‡్ష్యంచామని తెలిపారు. బ్యాంక్‌లు, ఫిన్‌టెక్‌ కంపెనీల మధ్య తగినంత సహకారం లేదని, డిజిటల్‌ పేమెంట్స్‌లో రాయితీలు పెంచాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు రేజర్‌పేలో టైగర్‌ గ్లోబల్, మ్యాట్రిక్స్‌ పార్టనర్స్, సికోయా ఇండియా వంటి ఇన్వెస్టర్లు 106.5 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి.

రూ.100 వరకు లావాదేవీకి జీరో ఎండీఆర్, చిన్న వ్యాపారులకు పరిమితి పెంచడం వంటి అంశాల కారణంగా వీరు క్యాష్ నుంచి డిజిటల్ లావాదేవీల బాట పడతారు’ అని ఎన్‌పీసీఐ ఎండీ అండ్ సీఈవో దిలిప్ అస్బే తెలిపారు.యూపీఐ మార్గంలో మర్చంట్ పేమెంట్స్‌కు ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.ఆఫ్‌లైన్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా లావాదేవీ నిర్వహిస్తే రూ.100 వరకు ట్రాన్సాక్షన్‌కు ఎలాంటి చార్జీలు ఉండవు. చిన్న వ్యాపారుల కోసం ఎన్‌పీసీఐ ఇప్పటికే పీ2పీఎం కేటగిరిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో నెలకు రూ.50,000 వరకు ఇన్‌వర్డ్ లావాదేవీలకు అనుమతి ఉంది. ఇప్పుడు ఈ పరిమితిని నెలకు రూ.లక్షకు పెంచింది. రియల్‌టైమ్‌లో డబ్బు మర్చంట్ అకౌంట్‌లో జమ అవుతుంది.

 

Leave a Reply