దిశ యాప్‌లో తొలి ఫిర్యాదు.. ఆరు నిమిషాల్లో పోలీసులు వచ్చేశారు

0

మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘దిశ’ యాప్ ద్వారా తొలి ఫిర్యాదు నమోదైందని, పోలీసులు సత్వరమే స్పందించి చర్యలు తీసుకున్నారని పేర్కొంటూ ‘సాక్షి’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఒకరు సోమవారం రాత్రి విశాఖ నుంచి విజయవాడకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో బయలుదేరారు.

విశాఖపట్నంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కూడా ఇదే బస్సులో ప్రయాణిస్తున్నారు. ఆయన స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా.

బస్సులో సీట్లు ఖాళీగా ఉండడంతో తెల్లవారుజామున ఆయన తన సీటు వద్దకు వచ్చి అనుచితంగా ప్రవర్తించారని ఆ మహిళా ఉద్యోగి చెప్పారు.

తెల్లవారు జామున 4.21 గంటల సమయంలో తన మొబైల్‌ ఫోన్‌ను ఐదు సార్లు షేక్ చేసి, దిశ యాప్‌ ద్వారా ఆమె ఎస్ఓఎస్ బటన్ నొక్కారు.

నా అందం ఏంటో నాకు తెలుసు: కాజల్

ఈ సమాచారం అందుకున్న దిశ కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ మహిళ ఏలూరు సమీపంలో ఉన్నట్లు గుర్తించి పశ్చిమ గోదావరి ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌కు సమాచారం అందించారు.

ఎస్పీ ఆదేశాలతో ఏలూరు త్రీ టౌన్‌ పోలీసులు వెంటనే బయలుదేరి తెల్లవారుజామున 4.27 గంటలకు (కాల్‌ వచ్చిన 6 నిమిషాల్లో) బస్సు వద్దకు చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడిపై ఏలూరు త్రీటౌన్‌ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ కింద కేసు నమోదైనట్లు సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్‌ తెలిపారు. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించిందని పోలీసులు తెలిపారు.

 

Disha app, developed by the technical services division of the Andhra Pradesh police, sends an alert to the Disha control room when a woman or girl in distress just shakes the mobile phone which contains the Disha App. The app also provides another way of calling for help – they can also press a button on the phone, but in emergency situations if that is not possible, the victim can send an alert to the police by simply shaking phone five times. The personnel at Disha control room in turn will alert the police available near the spot. Police will rush to the spot using GPS-equipped vehicles and assist the person in trouble or anticipating trouble.

 

శృతి మించిన ఎక్స్ ఫోజింగ్, డ్రెస్ పై ట్రోలింగ్.. నా ఇష్టం అంటున్న హీరోయిన్!

 

Leave a Reply