కలకలం రేపుతున్న ఉదంతం : పేషెంట్ ని చితకబాదిన డాక్టర్..

0

“వైద్యో నారాయణో హరి” అన్నారు మన పెద్దలు.. అంటే వైద్యం చేసి మనకు ప్రాణం పోసే ఆ వ్యక్తి ,ఆ వైద్యుడు నారాయణుడు తో సమానం ,అంటే ఆ దేవుడితో సమానం అని అర్థం. నిజమైన వైద్యుడు తన హస్తవాసి తోనే రోగుల ఆరోగ్యాన్ని నయం చేసేయగలడు. అలా హస్తవాసి బాగుండే వైద్యులు మనకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటారు. కొంతమంది డాక్టర్లు అయితే తమ ఫీజు కన్నా రోగి యొక్క ఆరోగ్యం మెరుగవడమే ముఖ్యం అనుకుంటారు. కొంతమంది డాక్టర్లు అయితే భారీగా ఫీజులు తీసుకున్నా ఆరోగ్యాన్ని మాత్రం చక్కగా నయం చేస్తారు .ఏది ఏమైనా సాధారణంగా డాక్టర్లు తన వద్దకు వచ్చే రోగిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు . కానీ ఇప్పుడు చెప్పబోయే వైద్యుడు మాత్రం అదో రకం .ఎందుకంటే ఆ వైద్యుడు రోగిని శ్రద్ధగా చూసుకోవడం తర్వాత ఆ రోగిని చితక బాదేశాడు .

👉వివరాల్లోకి వెళితే: రాజస్థాన్‌లో పెద్దాసుపత్రిగా పేరొందిన జైపూర్‌లోని ఎంఎస్ఎం ఆసుపత్రిలోని ఒక వార్డులో రెసిడెంట్ డాక్టర్ చికిత్స పొందుతున్న రోగిని చితకబాదిన ఉదంతం వెలుగు చూసింది. కాగా రోగిని చితకబాదిన వైద్యుని పేరు సునీల్ అని తెలుస్తోంది. ఆయన వార్డు నంబర్ 1- C లోని రోగిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. 🔴కారణం తెలియలేదు : ఆ రోగి బంధువులు సీనియర్ వైద్యునితో ఏదో విషయమై వాగ్వాదానికి దిగారు. ఈ నేపధ్యంలోనే డాక్టర్ సునీల్ ఆ రోగిపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిని అక్కడున్న రోగులు వీడియో తీశారు.దాంతో ఈ దుశ్చర్య వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ‌దీంతో ఆసుపత్రి వర్గాల్లో కలకలం చెలరేగింది.

🔴మానవ హక్కుల సంఘం మండి పాటు :కాగా ఈ ఉదంతం పై మానవ హక్కుల సంఘం మండి పడుతుంది. ఒక పేషెంట్ ని కాపాడాల్సిన డాక్టర్ అయ్యుండి ఇదేం అనైతిక చర్య అని తీవ్రంగా విమర్శించింది . ఈ వివాదాస్పద సంఘటన పై జూన్ 25లోగా నివేదిక అందించాలని సంబంధిత వైద్యాధికారులను మానవ హక్కుల సంఘం ఆదేశించింది. 👉కాగా ఈ విషయమై మోతీడూంగరీ పోలీసులు మాట్లాడుతూ ఈ ఉదంతంపై తమకు ఇప్పటివరకూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని అన్నారు.

Leave a Reply