మే 23న జగన్ గెలిచే ముహూర్తమే ఆ అభిమానిపెళ్లి ముహూర్తం ; పెళ్లి పందిరి లో ఎలక్షన్ల ఫలితాలు చూసేలా స్క్రీన్ లు !!!

Untitled design (67)

తన అభిమాన నాయకుడు జగన్ ఎన్నికల్లో గెలుపొంది.. సీఎం కావటానికి కీలకమైన మే23వ తేదీని తన జీవితంలో గుర్తుండిపోయేలా చేసుకునేందుకు వీలుగా తన పెళ్లిని ఫిక్స్ చేసుకున్నాడు.
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన చినసుబ్బారావు.. రావమ్మల కుమారుడు రామకోటయ్య.అతనుజగన్ కు వీరాభిమాని . ఈసారి ఎన్నికల్లో ఆయన ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధిస్తారన్న గట్టి నమ్మకం తో ఇదంతా చేస్తున్నాడు.

👉విషయం లోకి వెళితే : రామకోటయ్యకి గ్రామానికి చెందిన మాదగిరి శ్రీనివాసరావు కుమార్తె వెనీలాతో పెళ్లిని ఫిక్స్ చేశారు. కానీ ఎన్నికల ఫలితాలుఉండటం తో పెళ్ళికి ఎవరూ రాలేని పరిస్థితి రాకుండా ఉండేందుకు ప్లాన్ చేసేశాడు కోటయ్య..

👉అటు పెళ్లి ..ఇటు ఎలక్షన్ ఫలితాలు : ఎలక్షన్ ఫలితాలను చూసేందుకు పెళ్లి మండపంలో టీవీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసాడు.
ఓ పక్క ఎన్నికల ఫలితాలు.. మరోవైపు పెళ్లి వేడుకను చూడొచ్చంటూ.. ఒకే టికెట్ మీద రెండు సినిమాల రేంజ్లో బంధువులకు.. మిత్రులకు చెబుతూ శుభలేఖలు ఇస్తున్నారట. శుభలేఖలో కూడా పెళ్లి వేడుకల్లో ఎన్నికల ఫలితాలు లైవ్ లో చూసేందుకు వీలుగా టీవీలు ఏర్పాటు చేస్తున్న వైనాన్ని కోటయ్య పేర్కొనటం గమనార్హం. వీరి మాటతో.. తాము తప్పకుండా పెళ్లికి వస్తామని చెబుతున్నారట అక్కడి జనం .. 👉ఇంకేం ఆ అభిమాని కోసం జగన్ గెలిచి తీరాలని కోరుకుందాం..


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

1 thought on “మే 23న జగన్ గెలిచే ముహూర్తమే ఆ అభిమానిపెళ్లి ముహూర్తం ; పెళ్లి పందిరి లో ఎలక్షన్ల ఫలితాలు చూసేలా స్క్రీన్ లు !!!

  1. I am really loving the theme/design of your weblog.
    Do you ever run into any internet browser compatibility issues?
    A small number of my blog audience have complained about my blog not operating correctly in Explorer
    but looks great in Chrome. Do you have any ideas to help fix this issue?

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights