మొబైల్ రంగం లో విప్లవం. బ్యాటరీ ..లేకుండా పని చేసే మొబైల్స్ వచ్చేస్తున్నాయి..

Spread the love

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువవ్వడంతో రీఛార్జ్ ల సమస్య మాత్రమే కాదు, ఛార్జింగ్ సమస్య కూడా తీవ్రంగా వెంటాడుతోంది. ఛార్జింగ్ కోసం మనం అదనంగా పవర్ బ్యాంకుల్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి. మాటిమాటికీ ఛార్జింగ్ డౌన్ అయిపోతుంటే,అర్జెంట్ పనులు ఉన్న వారు ఇరిటేషన్‌ పడుతున్నారు.ఛార్జింగ్ అవసరం లేని ఫోన్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు చాలా మంది.త్వరలో వాళ్లందరి కోరిక నిజం అవ్వబోతుంది.ఛార్జింగ్ అవసరం లేని ఫోన్‌ కాదు,అసలు బ్యాటరీ యే లేని ఫోన్‌లు రాబోతున్నాయి .అవునండీ

👉అసలుబ్యాటరీతో పనిలేని ఫోన్ తయారవుతోంది :
రోజురోజుకూ ప్రపంచం మారిపోతోంది. బ్యాటరీతో పనిలేని ఫోన్స్ వస్తే, మనకిక ఛార్జింగ్ సమస్యలు లేనట్లే.

🔸ఛార్జింగ్ అవసరం లేని మొబైల్ :
మొబైల్‌లో ఉన్న బ్యాటరీ ఎంతకాలం పనిచేస్తుందన్నదాన్ని బట్టీ… ఆ స్మార్ట్ ఫోన్ ఎంతకాలం వాడొచ్చో నిర్ణయించుకుంటున్నాం. చాలా మంది బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉండే స్మార్ట్ మొబైళ్లనే కొంటున్నారు. ఈ రోజుల్లో చాలా ఫోన్లు 3000mAh లేదా 4000mAh బ్యాటరీలతో వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వాషింగ్టన్ యూనివర్శిటీ పరిశోధకులు… బ్యాటరీలతో పనిలేని మొబైల్ ఫోన్‌ను తయారుచేశారు. బ్యాటరీ లేదంటే ఛార్జింగ్ లేనట్లే. అయినప్పటికీ ఆ ఫోన్ పనిచేస్తోంది.
🔸బాటరీ లేకుండా ఎలా పని చేస్తాయి..అంటే :
సాధారణం గా ఫోన్లు ఎలక్ట్రిక్ పవర్ ని వాడుకుని పని చేస్తాయి. దాని బదులు… రేడియో సిగ్నల్స్ వాడుకొని పనిచేస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచించి, సక్సెస్ అయ్యరు మన శాస్త్రవేత్తలు . ఫలితంగా బ్యాటరీలేకుండా లైట్ వెయిట్ మైక్రోవేవ్స్‌ ని ఉపయోగించి పనిచేసే మొబైల్స్ ని కనుక్కున్నారు . ఆ మొబైల్ ఫోన్ ద్వారా… స్కైప్ కాల్స్ చేయడానికి వీలైంది.
ప్రస్తుతం బ్యాటరీ లేని ఆ మొబైల్ ఫోన్… ఎలక్ట్రిసిటీ పవర్‌తో పనిచేసే వీలుంటుందా అన్నదానిపై పరిశోధకులు ప్రయోగాలు చేస్తున్నారు. అవి సక్సెస్ అయితే, అతి త్వరలో బ్యాటరీలేని, ఛార్జింగ్ అవసరం లేని మొబైల్ ఫోన్లను మనం వాడొచ్చు. అదే జరిగితే… స్మార్ట్ ఫోన్ ప్రపంచమే మారిపోతుంది. స్మార్ట్ ఫోన్లు మరింత స్లిమ్‌ డిజైన్‌తో తయారుచేయడానికి వీలవుతుంది. మొబైల్ ఫోన్ల పరిశోధనల్లో ఇదో విప్లవాత్మక ముందడుగు అనే చెప్పుకోవచ్చు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading