మెగాస్టార్ మెగా మూవీ సైరా. 2019లో తెలుగు పరిశ్రమ నుంచి వస్తున్న రెండో అత్యంత భారీ సినిమా. అక్టోబర్ 2న విడుదలవుతున్న ఈ మెగాస్టార్ మూవీ మీద చాలా అంచనాలు వున్నాయి.
చిరంజీవి 151వ సినిమాగా మెగాభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని హైలైట్స్ ఎక్స్ క్లూజివ్ గా గ్రేట్ ఆంధ్ర పాఠకుల కోసం..
- సినిమా ఆరంభంలో ఝాన్సీ లక్ష్మీ భాయి పాత్రలో హీరోయిన్ అనుష్క కనిపిస్తుంది. ఆమె నోటి వెంటే సైరా నరసింహారెడ్డి కథ చెప్పడం ప్రారంభమవుతుంది.
సినిమాలో సైరా నరసింహారెడ్డి అనే టైటిల్ సాంగ్ అయిదునిమషాలకు పైగా వుంటుంది. సిరివెన్నెల ఈ పాట రాసారు.
సినిమాలో అత్యంత కీలకమైన అండర్ వాటర్ ఫైట్ ఒకటి వుంటుంది. తమన్నా-చిరంజీవి- ఫైటర్ల మధ్య వుండే ఈ ఫైట్ కోసం భారీగా ఖర్చుచేసారు. విదేశీ టెక్నీషియన్లు పనిచేసారు.
సినిమా క్లయిమాక్స్ అన్నది ఎమోషనల్ గా డైలాగ్ బేస్డ్ గా వుంటుంది కాబట్టి, ప్రీ క్లయిమాక్స్ ఫుల్ యాక్షన్ తో వుంటుంది. దాని కోసం కొన్ని కోట్లు ఖర్చు చేసారు. క్లయిమాక్స్ లో మెగాస్టార్ నోటి వెంట సూపర్ డైలాగ్స్ వస్తాయి.
సినిమా తొలిసగం అంతా నరసింహారెడ్డి జమీందారీ జీవితం, ఆ విలాసాలు తదితర అంశాలు వుండి. ద్వితీయార్థంలో అసలు పోరాట గాధ ప్రారంభమవుతుంది.
సైరాలో జాతర పాట ఒకటి వుంటుంది. అది మెగా మాస్ అభిమానులను ఈలలు వేసేలా చేస్తుంది.
సినిమాలో ఏ సీన్ అయినా కూడా తెరనిండా మనుషులు. సెట్ ప్రాపర్టీస్ భారీగా వుండి ఖర్చు క్లియర్ గా కనిపిస్తూ వుంటుంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.