సాధారణంగా ఎక్కడైన ఏం జరుగుతుంది..ముందు నిశ్చితార్థం,తరువాత పెళ్లి, ఆ తరువాత గర్భం ఇది ఒక సంప్రదాయం ప్రకారం సంసారానికి పద్దతి. కానీ సంస్కృతిలను బట్టి సంప్రదాయం కూడా ఒక్కో దేశం లో ఒక్కో విధంగా ఉంటుంది. విషయం ఏంటంటే బ్రిటన్‌కు చెందిన మోడల్, నటి అయిన అమీ జాక్సన్ నిశ్చితార్థం..నిన్న మే5 న లండన్ లో జరిగింది. ఇందులో విశేషం గాని ఆశ్చర్యం గాని ఏముంది..ఇది న్యూస్ ఏంటి అనుకుంటున్నారా.అక్కడికే వస్తున్నా.. రింగులు మార్చుకునే సమయానికి అమీ జాక్సన్ గర్భవతి. ఆమె కొంతకాలంగా బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉంది. ఈ ఏడాది మార్చి 31న ,తాను పెళ్లికాకుండానే గర్భవతిఅయ్యానని గర్వంగా ప్రకటించుకుంది కూడా.
బ్రిటన్‌కు చెందిన మోడల్, నటి అమీ జాక్సన్ దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘2.0’లో వసీకరణ్‌కు రోబో అసిస్టెంట్ వెన్నెలగా నటించి మెప్పించారు. ఈమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించారు. ‘2.0’ తరవాత అమీ ఏ సినిమాను అంగీకరించలేదు. దీనికి కారణం అప్పుడు ఆమె గర్భవతి.
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో చాలాకాలంగా అమీ జాక్సన్ డేటింగ్‌లో ఉన్నారు. తాము పెళ్లికి సిద్ధమవుతున్నట్లు, నిశ్చితార్థం చేసుకున్నట్లు ఈ ఏడాది జనవరి 1న అమీ జాక్సన్ ప్రకటించారు. ఆ తరవాత బ్రిటన్ మదర్స్ డే రోజు తాను తల్లిని కాబోతున్నానని ప్రకటించి షాక్ ఇచ్చారు. తాను గర్భంతో ఉన్న ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు గర్భంతోనే ప్రియుడితో అధికారికంగా నిశ్చితార్థం చేసుకుని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.
జార్జ్ పనాయొటో, అమీ జాక్సన్ నిశ్చితార్థ వేడుక లండన్‌లో ఆదివారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. నిశ్చితార్థ వేడుకలో కాబోయే భర్తతో కలిసి అమీ జాక్సన్ డ్యాన్స్ కూడా చేశారు. కాగా, పెళ్లి మాత్రం పిల్లలు పుట్టాక గ్రీస్‌లో వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.