టీమిండియాతో ఆదివారం జరిగే తొలి టీ20 మ్యాచ్ లో ఆడేందుకు సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ విజయంతో మొదలుపెట్టాలని టీమిండియా ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. మరోవైపు శ్రీలంక ఆటగాళ్లు కూడా కొత్త సంవత్సరాన్ని విజయంతో ప్రారంభించాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే స్టేడియంలో ఇరుజట్లు కఠోర సాధన చేస్తున్నారు. గౌహతీలోని బర్సపారా స్టేడియంలో ఇరుజట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. దీంతో శిఖర్ ధవన్, కెఎల్ రాహుల్ లు ఓపెనర్లుగా క్రీజ్‌లోకి దిగనున్నారు.
టీమిండియా జట్టులో శిఖర్ ధవన్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, మనీష్ పాండే, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, చాహల్ బరిలోకి దిగుతున్నారు.
శ్రీలంక జట్టులో లసిత్ మలింగ(కెప్టెన్), దనుష్క గుణతిలక, అవిష్కా ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్, దాసున్ షానకా, కుసల్ జనిత్ పెరెరా, నిరోషన్ డిక్వెల్లా, ధనంజయ డి సిల్వా, ఇసురు ఉదనా, భానుకా రాజపక్సే, ఓషాడా ఫెర్నాండో, వనిండు హసరంగ, లాహిరు కుమార, కుసాల్ మెండిస్, లక్షన్ సందకన్ సభ్యులుగా ఉన్నారు.