కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో మాస్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ రివ్యూలను అందుకుంది. కేవలం 10 రోజుల్లోనే రూ.460 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది.
కాగా ‘దేవర’ కు కొనసాగింపుగా పార్ట్-2 ఉంటుందని కొరటాల శివ అండ్ టీమ్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. అలాగే ‘దేవర’ లో ఎన్నో ప్రశ్నలను వదిలేసి పార్ట్ 2 పైఅంచనాలు పెంచారు. కొరటాల శివ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దేవర 2 గేమ్ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ దేవర పార్ట్ 2లో జాన్వీ పాత్ర కూడా శక్తివంతమైన పాత్ర అవుతుంది. జాన్వీ పాత్రను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు అన్నారు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ బలంగా ఉంది. దర్శకుడిగా పార్ట్ 2పై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కథ యొక్క వాస్తవ ఘటనలను పార్ట్ 2 లో చూడవచ్చు. అన్ని పాత్రలు అగ్రశ్రేణిలో ఉంటాయి. ఎన్టీఆర్ అభిమానులందరికీ ఒక్కటి చెప్పాలి. దేవర 1 లో మీరు చూసింది 10% మాత్రమే. రెండవ భాగంలో మీరు 100% చూస్తారని” తన మాటల్లో చెప్పుకొచ్చాడు.