Announcement Poster : Mega 157

Mega157
Spread the love

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హీరోగా 157వ చిత్రాన్ని ఆయన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ప్రకటించారు. తొలి చిత్రం బింబిసార’తో సంచలన విజయం అందుకున్న వశిష్ఠ మల్లిడి (Vasishta) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్ట్‌ 22 మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా యువి క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రం గురించి ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది.

 

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హీరోగా 157వ చిత్రాన్ని ఆయన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ప్రకటించారు. తొలి చిత్రం బింబిసార’తో సంచలన విజయం అందుకున్న వశిష్ఠ మల్లిడి (Vasishta) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్ట్‌ 22 మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా యువి క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రం గురించి ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది. ఈ మేరకు పంచభూతాలను చూపిస్తూ డిజైన్‌ చేసిన ఓ పోస్టర్‌ విడుదల చేశారు. పోస్టర్‌ చూస్తుంటే సోషియో ఫాంటసీ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతుందని తెలుస్తోంది.

తొలి చిత్రానికే సెమీ పీరియాడిక్‌ డ్రామాను సోషియో ఫాంటసీ కథను ఎంచుకుని రిస్క్‌ అయినా ప్రయత్నం విఫలం కాకుండా సక్సెస్‌ చేసి చూపించిన వశిష్ఠ ఈ చిత్రంతో మెగా అభిమానులకు ఫుల్‌ మీల్స్‌ వడ్డిస్తాడని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. #Chiranjeevi157·

 

చిత్ర దర్శకుడు మల్లిడి వశిష్ఠ కూడా ఈ చిత్రం గురించి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘‘నన్ను, నేను చెప్పిన కథను అంగీకరించిన మైటీ మెగాస్టార్‌ చిరంజీవిగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఆయన్ను వెండితెరపై చూపించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞుడిని’’ అని ట్వీట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *