పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వ పనులు, సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుమలకు వెళ్లిన సంగతి తెలిసిందే. పవన్ తో పాటు ఆయన కుమార్తెలు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, దర్శకుడు త్రివిక్రమ్, థమన్… పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తిరుమల నుంచి ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.
పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ – ఆనంద్ సాయి కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన జీవితంలోని ఇద్దరు ప్రాణ స్నేహితులతో పవన్ కళ్యాణ్ దిగిన ఫోటో వైరల్ అవుతుంది.
పవన్ కళ్యాణ్ తొలిప్రేమ రిలీజ్ కు ముందు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో స్నేహం చేసాడు. ఇద్దరూ కలిసి చెన్నైలో బైక్స్ మీద తిరిగేవారు. ఆనంద్ సాయి తర్వాత ప్రముఖ కళాత్మక దర్శకుడిగా మారారు. దేవాలయాల నిర్మాణంలో శిల్పి, వాస్తు సలహాదారు, వాస్తుశిల్పిగా కూడా ప్రముఖ పాత్ర పోషించారు. పవన్, సాయి ఇద్దరూ సన్నిహిత మిత్రులు. అందుకే ఈ ఇద్దరూ తరచుగా కలిసి కనిపిస్తుంటారు. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆనంద్ సాయి రెగ్యులర్ గా పవన్ కళ్యాణ్ ని కలుస్తూనే ఉన్నారు. అందుకే పవన్ తో పాటు తిరుమలకు వచ్చారు.