Teluguwonders:
బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తిచేయడంలో విఫలం కావడమే కాకుండా గాయాలు కొనితెచ్చుకోవడంతో ఇంటి సభ్యులపై బిగ్ బాస్ సీరియస్ అయ్యారు. ముఖ్యంగా శ్రీముఖిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్ బాస్ ఆమెకు శిక్ష ఖరారు చేశారు.‘బిగ్ బాస్’ మూడో సీజన్ ఆసక్తికరంగా కొనసాగుతోంది.
💗బుధవారం నాటి ఎపిసోడ్‌లో:
బుధవారం నాటి 18వ ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ రచ్చ రచ్చ అయ్యింది. గాజు పెట్టెలో ఉన్న డబ్బులును కొట్టేయడానికి శ్రీముఖి డంబెల్‌తో అద్దాలను పగలగొట్టగా.. రవికృష్ణ చేతితోనే అద్దం పగలగొట్టి డబ్బులు తీసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆయన మణికట్టుకి గాయమైంది. ఈ విషయంలో రోహిణి మినహా మిగిలిన సభ్యులంతా శ్రీముఖిని తప్పుబట్టారు. ఆమె వల్లే రవికృష్ణకు గాయమైందని నిందించారు. బిగ్ బాస్ రవికృష్ణను మెడికల్ రూంలోకి పంపి వైద్యం కూడా అందించారు. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది.
💗గురువారం నాటి ఎపిసోడ్‌లో :
ఇక గురువారం నాటి 19 ఎపిసోడ్‌లో ఈ టాస్క్ గురించే ప్రధాన చర్చ జరిగింది. ఇంటి సభ్యుల చర్యను సీరియస్‌గా తీసుకున్న బిగ్ బాస్ వారికి క్లాస్ పీకారు. కన్ఫెషన్ రూంలోకి వెళ్లిన రవికృష్ణ ఈ విషయంలో తన తప్పు ఉందని బిగ్ బాస్‌కి క్షమాపణలు చెప్పారు. అయితే, అద్దం పగలగొట్టమని రవికృష్ణను ప్రోత్సహించిన శ్రీముఖి చర్యను బిగ్ బాస్ తప్పుబట్టారు. దీనికి శిక్షగా వచ్చే వారం ఎలిమినేషన్‌కు శ్రీముఖిని బిగ్ బాస్ నేరుగా నామినేట్ చేశారు.
🔴వితికా షెరు ఒకటే ఏడుపు:
బెడ్‌పై భర్త వరుణ్ సందేశ్ ఛాతిపై వాలిపోయిన వితికా షెరు కంటతడి పెట్టుకుంది. ఒకటే ఏడుపు. అసలు ఎందుకు ఏడుస్తున్నావంటూ ఆమెను రాహుల్ ఓదార్చాడు. టిష్యూలు తీసుకొచ్చి కళ్లు తుడిచాడు. టాస్క్‌లో జరిగిన గొడవ గురించి తలుచుకుని ఏడుస్తున్నావా అంటూ వరుణ్ సందేశ్ తన భార్యను అడిగాడు. అవునూ అంటూ చిన్నగా వితిక తల ఊపింది. ఇక వరుణ్, రాహుల్ కలిసి వితికాను ఓదార్చారు. ‘‘టిష్యూకి మొత్తం లిప్‌స్టిక్ అంటుకుంది చెల్లెమ్మ’’ అంటూ రాహుల్ నవ్వించే ప్రయత్నం చేశాడు.