Teluguwonders:
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకుంది. 16 మంది కంటెస్టంట్స్ తో మొదలైన బిగ్ బాస్ 3 ఇప్పుడు హౌజ్ లో 11 మంది కంటెస్టంట్స్ లో ఆట కొనసాగుతుంది. ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అవగా మంగళవారం అందులో నుండి ముగ్గురు సేఫ్ జోన్ లోకి వచ్చారు.
ఇదిలాఉంటే బిగ్ బాస్ తెలుగు ఆరు వారాలు గడుస్తున్నా ఒకసారి కూడా నామినేషన్స్ లోకి వెళ్లలేదు ఆలి రెజా. అతను స్ట్రాంగ్ కంటెస్టంట్ అని అందరికి తెలుసు. అయితే ఆలి రెజా తర్వాత అంతే స్ట్రాంగ్ గా ఉన్నారు శ్రీముఖి, శివ జ్యోతి. యాంకర్ శ్రీముఖికి బయట ఫాలోయింగ్ ఎంత ఉందో అందరికి తెలిసిందే. అందుకే ఆమె నామినేషన్స్ లో ఉన్నా మొదట సేఫ్ అవుతుంది.
శ్రీముఖి కూడా తన గేం తను ఆడుతూ వస్తుంది. అయితే స్ట్రాంగ్ కంటెస్టంట్ గా హౌజ్ లో మిగతా వారిని ఇన్ ఫ్లూయెన్స్ అయ్యేలా చేయడంలో శ్రీముఖి తన గేమ్ ప్లాన్ వర్క్ అవుట్ చేస్తుంది. ఇక శివ జ్యోతి కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ అని చెప్పొచ్చు. యాంకర్ గా తీన్మార్ వార్తలతో ఫేమస్ అయిన శివ జ్యోతి తను చాలా ఎమోషనల్ అని తెలుస్తుంది. హౌజ్ లో ఎవరికి ఏం జరిగినా ముందు శివ జ్యోతి కళ్లల్లో నీళ్లు వస్తాయి.
అయితే ఆమె ఎంత ఎమోషనల్ గా కనిపిస్తుందో అంతే స్పోర్టింగ్ స్పిరిట్ తో ఆడుతుంది. ఈ వారం కెప్టెన్ గా శివ జ్యోతి హౌజ్ లో కంటెస్టంట్స్ అందరిని పర్ఫెక్ట్ గా ఉండేలా చేసింది. సో ఇప్పటివరకు చూస్తే ఆలి రెజా, శివ జ్యోతి, శ్రీముఖి ఈ ముగ్గురు టాప్ 3లో ఉండొచ్చని అంటున్నారు. మరి బిగ్ బాస్ హౌజ్ లో వారం వారం ఈక్వేషన్స్ మారిపోతాయి. రానున్న వారాల్లో ఈ టాప్ ప్లేస్ మారుతుందేమో చూడాలి.