యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ట్రైలర్

entha-manchivaadavuraa-theatrical-trailer-trending-youtube:నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.[the_ad id=”4850″]
ప్రస్తుతంగా ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉందని.. చిత్రయూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. బుధవారం రాత్రి విడుదలైన ‘ఎంత మంచివాడవురా!’.
ట్రైలర్‌కు ఇప్పటివరకు 19లక్షలకుపైగా వ్యూస్ రెండు మిలియన్స్ దిశగా దూసుకుపోతోంది. కళ్యాణ్‌రామ్ సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణంలో ఉమేష్ గుప్త, సుభాష్ గుప్తలు నిర్మిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ట్రైలర్
‘తాతయ్య దగ్గర శివ, ఊళ్లో శివ, ఈ అమ్మాయి దగ్గర రిషి ఇలా ఒక్కో చోట ఒక్కో పేరు, రిలేషన్ మెయింటేన్ చేస్తున్నాడు’అంటూ మొదలైన ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. రిలేషన్‌షిప్, ఎమోషన్ అనే పాయింట్‌కు మాస్, లవ్, కామెడీని చేర్చి అందమైన చిత్రంగా దర్శకుడు తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.[the_ad_placement id=”adsense-in-feed”]
అంతేకాకుండా సతీష్ వేగేశ్న చిత్రమంటేనే ఆకట్టుకునే డైలాగ్‌లకు కొదువుండదు. ఈ ట్రైలర్‌లకూడా పలు డైలాగ్‌లు పేలాయి. ‘పేరుతో పిలిచేదానికంటే బంధుత్వంతో పిలిచేదానికి ఎమోషన్ ఎక్కువ’, ‘అడిగి ఐలవ్యూ చెప్పించుకోకూడదు’, ‘యస్.. నాకు హీరోలంటే పిచ్చి’, ఎదురించేవాడు రానంతవరకేరా.. భయపెట్టేవాడి రాజ్యం’, ‘ఎవరైనా ఏదైనా ఇస్తే.. తిరిగిచ్చేస్తాను..
అది ప్రేమైనా, భయమైనా’అంటూ వచ్చే డైలాగ్‌లు పిచ్చెక్కిస్తున్నాయి. తనికెళ్ల భరణి, విజయకుమార్, సుమిత్ర, నరేష్, సుహాసిని, వెన్నెల కిశోర్, శరత్ బాబు, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతమందిస్తున్నాడు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.

