మరింత ఆకర్షణీయంగా ఉన్న మహేష్ బాబు సంతూర్ యాడ్

Even more impressive is Mahesh Babu Santoor Ad

Teluguwonders:

‘‘నేనా.. కాలేజా.. మమ్మీ.. సంతూర్.. సంతూర్’’ అంటూ వచ్చే ప్రకటనను కొన్ని ఏళ్లుగా మనం టీవీలో చూస్తున్నాం. సంతూర్ సబ్బు వాడితే ఎప్పటికీ యవ్వనంగా మెరిసే చర్మం మీ సొంతమని ఈ యాడ్ ఉద్దేశం. అసలు సంతూర్ సోప్‌కి అంత ఆదరణ లభించడానికి కారణం ఈ విధమైన ప్రకటనలే. సంతూర్‌ సబ్బుని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఈ ప్రకటన ఎంతగానో ఉపయోగపడింది. మోడల్స్ మారినా, బ్రాండ్ అంబాసిడర్స్ మారినా ఈ ప్రకటనలో ఉన్న థీమ్ మాత్రం మారలేదు. ఇప్పటికీ ఎప్పటికీ ‘‘యవ్వనంగా మెరుస్తూ కనిపించే’’ యాడ్ ఇది.

🔴ముగ్గురు సూపర్ స్టార్లతో :

హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ముగ్గురు సూపర్ స్టార్లను సంతూర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. హిందీలో వరుణ్ ధావన్, తమిళంలో కార్తి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.

👉తెలుగులో రెండోసారి మహేష్ బాబు :

సూపర్ స్టార్ మహేష్ బాబు రెండోసారి సంతూర్ సబ్బుకి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. మహేష్‌ బాబుతో చిత్రీకరించిన కొత్త టీవీ కమర్షియల్ యాడ్‌ను విప్రో తాజాగా విడుదల చేసింది
సంతూర్ సబ్బుకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే ఒకసారి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఇప్పుడు రెండోసారి విప్రో సంస్థ తమ సంతూర్ సోప్‌కు మహేష్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.మహేష్ బాబు సాయంతో తమ బ్రాండ్ అమ్మకాలను మరింత పెంచుకోవాలని విప్రో సంస్థ చూస్తోంది. మహేష్‌తో కొత్త టీవీ కమర్షియల్ యాడ్‌ను చిత్రీకరించి రిలీజ్ కూడా చేసింది. ఈ యాడ్ మరింత ఆకర్షణీయంగా ఉంది.

💚కొత్త ‘సంతూర్’ బేబీ తో మహేష్ బాబు!!:

మహేష్‌ బాబు స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. రోహిత్ శర్మ సిక్స్ బాదాడు. గ్యాలరీలో ఉన్న మహేష్ బంతిని అందుకోబోయారు. కానీ, ఆ బంతిని ఒక అందమైన అమ్మాయి క్యాచ్ పట్టుకుంది. ఆమెను చూసి మహేష్ మెస్మరైజ్ అయిపోయారు. ఆమె అందానికి ఆకర్షితులయ్యారు. తన కొత్త సినిమాకి కాలేజ్ అమ్మాయి దొరికింది అనుకొని ఆమె దగ్గరికి వెళ్లి.. ‘‘మా సినిమాలో’’ అనే లోపే మమ్మీ అంటూ పాప పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంకేముంది మళ్లీ మామూలే..!!


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights