ఫ్యాటీ లివర్‌ సమస్యకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. జస్ట్ ఈ మార్పులతో దెబ్బకు క్లీన్ అవుతుంది..

fatty-liver-1

ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ఈ సమస్యను నివారించడానికి అలాగే.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని జాగ్రత్తలు అవసరం. కాలేయ సమస్యలకు ప్రయోజనకరంగా ఉండే కొన్ని ఇంటి నివారణలను కూడా మీరు ప్రయత్నించవచ్చు. ఫ్యాటీ లివర్ సమస్యను నివారించేందుకు ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

నేటి కాలంలో, చెడు ఆహారపు అలవాట్లు, క్షీణిస్తున్న జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. వాటిలో ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) సమస్య ఒకటి. ఈ సమస్య నేటి కాలంలో చాలా మందిలో కనిపిస్తుంది. గతంలో, ఇది వృద్ధులలో మాత్రమే ఎక్కువగా కనిపించేది.. కానీ ఇప్పుడు ఇది యువతను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ స్థితిలో, కాలేయ కణాలలో అదనపు కొవ్వు పేరుకుపోతుంది. ఫ్యాటీ లివర్‌లో రెండు రకాలు ఉన్నాయి.. ఆల్కహాలిక్, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఒకదానిలో, ఆల్కహాల్ కాలేయ కణాలను దెబ్బతీస్తుంది. మరొక స్థితిలో, ఊబకాయం, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, పేలవమైన జీవనశైలి అలవాట్లు కారణాలు.

ఎవరికైనా ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే, ముందుగానే చికిత్స ప్రారంభించడం చాలా ముఖ్యం. దానికి మూలకారణాన్ని గుర్తించి నియంత్రించాలి. ఇంకా, ఆహారం – జీవనశైలిలో మార్పులు ఖచ్చితంగా చేసుకోవాలి.. వైద్య చికిత్సతోపాటు.. కొన్ని ఇంటి నివారణలు కూడా ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం..

ఆయుర్వేద నిపుణుడు కిరణ్ గుప్తా మాట్లాడుతూ.. కొవ్వు కాలేయ సమస్యలు ఉన్నవారు నూనె లేని – తక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అదనంగా, దోసకాయలు, క్యారెట్లు కలిగిన సలాడ్లు తినండి. ఉడికించిన కూరగాయలు తినండి. ప్రతిరోజూ నడవండి.. కొన్ని నిమిషాలు వేగంగా నడవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.. ఇంకా ప్రాణాయామం చేయండి. తగినంత విశ్రాంతి తీసుకోండి.. ప్రతిరోజూ 7 నుండి 8 గంటల నిద్ర పోయేలా చూసుకోండి. చల్లని – శీతల పానీయాలను నివారించండి. ప్రతిరోజూ 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగండి. అలాగే, మీరు పాలు – పాల ఉత్పత్తులను తీసుకోవడం పరిమితం చేయండి.. అంటూ ఆయన వివరించారు.

రోజూ నిమ్మకాయ – తేనె నీరు త్రాగడం కూడా ఈ సమస్యకు సహాయపడుతుంది. కాలేయ సమస్యలకు సొరకాయ రసం, బూడిద గుమ్మడికాయ రసం – పుదీనా రసం చాలా ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సుగంధ ద్రవ్యాలు కూడా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. కొవ్వు కాలేయం ఉన్న రోగులకు వాము, సోంపు, దనియాలు కలిపిన నీటిని కూడా ఇవ్వవచ్చు. అదనంగా, వ్యక్తి అధిక బరువుతో ఉంటే, ఆ బరువును నిర్వహించడం కూడా సిఫార్సు చేస్తున్నారు.. అలాంటి వారు బరువు తగ్గేందుకు సరైన డైట్ ను అనుసరించాలి..

ఆహారంలో మార్పులు చేసుకోండి

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆహారంలో మార్పులు చేసుకోండి. మీ ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోండి. ఎక్కువగా మెంతికూర, సొరకాయ, బీరకాయ, బెండకాయ లాంటి వాటిని వండుకోని తినండి.. సలాడ్‌లు తినండి. ఇంట్లో వండిన భోజనం తినండి. నూనె, కారంగా ఉండే వాటితోపాటు.. జంక్ ఫుడ్‌లను నివారించండి. మద్యం – ధూమపానం వంటి అలవాట్లను పూర్తిగా వదులుకోవడం మంచిది.

రోజూ వ్యాయామం చేయండి

బరువు నియంత్రణ – ఫిట్‌నెస్ కోసం రోజువారీ వ్యాయామం చాలా అవసరం. ఉదయం 20 నుండి 30 నిమిషాలు నడకకు వెళ్లండి. ఎక్కువసేపు కూర్చోవడం మానుకోండి. మీరు కూర్చునే ఉద్యోగం చేస్తుంటే, మధ్య మధ్యలో కొంత సమయం కేటాయించి 2 నిమిషాలపాటు నడవండి.. అలాగే, ఒత్తిడిని తగ్గించుకోండి.

ఇంకా సూర్య నమస్కారం, కపలాభతి – అనులోమ-విలోమ చేయవచ్చు. ఇవి శారీరక – మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు ప్రతిరోజూ కొన్ని నిమిషాలు ధ్యానం కూడా చేయవచ్చు. అదనంగా, ప్రతిరోజూ 7 నుండి 8 గంటల నిద్ర పొందడం ముఖ్యం. ఇది శరీరానికి విశ్రాంతిని అందిస్తుంది, శరీరం తనను తాను బాగుచేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఏదైనా ఇంటి నివారణను తీసుకునే ముందు, మీ వైద్యుడిని సంప్రదించండి. మీ వైద్య పరిస్థితి ఆధారంగా మీకు ఏది సరైనదో వారు మీకు సలహా ఇవ్వగలరు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights