దారుణం: గుజరాత్ లో ఘోర అగ్ని ప్రమాదం ;24 మంది విద్యార్థుల మరణం..

Untitled design (86)

కోచింగ్ సెంటర్‌లో ఘోర అగ్నిప్రమాదం..20 మంది విద్యార్థులు దుర్మరణం
అన్యాయం గా 20 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి అయ్యారు.
🔥గుజరాత్‌లోని సూరత్‌లో సర్తానా ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 👉రెండంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 20 మంది విద్యార్థులు చనిపోయారు. మంటల్లో కాలిపోయి 14 మంది మంది విద్యార్థులు మరణించగా.. ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పైనుంచి కిందకు దూకి మరో ఆరుగురు చనిపోయారు. మరికొందరికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

👉విషయంలోకి వెళ్తే :
రెండస్తుల భవనంలో కోచింగ్ సెంటర్ నడుస్తోంది. రోజూలాగే ఇవాళ కూడా చాలా మంది విద్యార్థులు క్లాసులకు హాజరయ్యారు. ఐతే అకస్మాత్తుగా ఆ బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కూడా అలుముకోవడంతో విద్యార్థులకు ఊపిరాడలేదు. పలువురు విద్యార్థులు శ్వాస ఆడక చనిపోగా..మరికొందరు సజీవదహనమ్యారు. పలువురు విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పై నుంచి కిందకు దూకారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
🔵నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి :
సూరత్ ప్రమాదంపై నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాభ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని..ఘటనాస్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights