*కరోనాపై ప్రపంచంలోనే మొట్టమొదటి దివ్యాస్త్రం

IMG-20200812-WA0007.jpg

*వ్యాక్సిన్‌ సిద్ధం*

*కరోనాపై ప్రపంచంలోనే మొట్టమొదటి దివ్యాస్త్రం*

*సాకారం చేసిన రష్యా*

*మహమ్మారి నుంచి సమర్థంగా, స్థిరంగా రక్షణ*

*సెప్టెంబర్‌ నుంచి భారీగా ఉత్పత్తి*

*మా కుమార్తెకూ ఇచ్చాం* *అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటన*

*దిగుమతిపై ఆనేక దేశాల ఆసక్తి*

*టీకా భద్రతపై కొందరి అనుమానాలు* మాస్కో: కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచానికి శుభవార్త. ప్రాణాంతక కొవిడ్‌ మహమ్మారిపై పోరాడే కీలక ఆయుధాన్ని రష్యా ఆవిష్కరించింది. ఈ మహమ్మారి నివారణకు మొట్టమొదటిసారిగా టీకాను పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మంగళవారం ప్రకటించారు. ఇది సమర్థంగా పనిచేస్తోందని, కొవిడ్‌-19 నుంచి స్థిరంగా రక్షణ కల్పిస్తోందని పేర్కొన్నారు. తన ముగ్గురు కుమార్తెల్లో ఒకరికి ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చినట్లు చెప్పారు. ఈ టీకా అభివృద్ధి.. ప్రపంచానికి ఒక పెద్ద ముందడుగు అని పేర్కొన్నారు. అయితే తుది విడత పరీక్షలు పూర్తికాక ముందే దీనికి అనుమతులు ఇవ్వడంపై, దీని భద్రతా ప్రమాణాలపై పలువురు అంతర్జాతీయ నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు.

*రూపకర్తలు ఎవరు?*

* గమలేయా పరిశోధన సంస్థ, రష్యా రక్షణ మంత్రిత్వశాఖ *

*క్లినికల్‌ ప్రయోగాలు ఎంత మందిపై* : 38 *

*ఎప్పటి నుంచి* : జూన్‌ 18 నుంచి * టీకాతో కొవిడ్‌ నుంచి 2 ఏళ్ల పాటు రక్షణ! *సురక్షితమే: పుతిన్‌*

* ఈ టీకాను పరీక్షించాం.. సురక్షితమని తేలింది

* కరోనా నుంచి సమర్థ, స్థిర రక్షణ * మా కుమార్తెకు కూడా ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చాం

* ఆమెలో భారీగా యాంటీబాడీలు ఉత్పత్తయ్యాయి

*వ్యాక్సిన్‌ ఎవరికి.. ఎప్పుడు..*

* *టీకా ఉత్పత్తి ఎప్పుడు:

* సెప్టెంబర్‌ నుంచి * *మొదట ఎవరికి* : వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, రిస్కు ఎక్కువగా ఉన్నవారికి *

*ఎప్పటి నుంచి* : అక్టోబర్‌ నుంచి * *సామాన్య ప్రజలకు* : 2021 జనవరి 1 నుంచి అందుబాటులోకి * *ప్రపంచవ్యాప్తంగా మూడో దశ క్లినికల్‌ ప్రయోగాల్లో ఉన్న కరోనా టీకాలు* : 6 *‘స్పుత్నిక్‌-వి’గా నామకరణం* 1957లో సోవియట్‌ యూనియన్‌ ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరిట ఈ టీకాకు ‘స్పుత్నిక్‌-వి’ అని నామకరణం చేశారు. ఈ వ్యాక్సిన్‌పై అవసరమైన పరీక్షలు నిర్వహించినట్లు తాజాగా ఓ ప్రభుత్వ సమావేశంలో పుతిన్‌ పేర్కొన్నారు. ‘‘కరోనాపై ప్రపంచంలోనే తొలిసారిగా ఒక టీకాను నేడు .

రిజిస్టర్‌ చేశాం. మా కుమార్తెకు ఆ వ్యాక్సిన్‌ను ఇచ్చారు. మొదటి డోసు తర్వాత ఆమె శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది. మరుసటి రోజు అది 37 డిగ్రీలకు తగ్గింది. రెండో డోసు ఇచ్చాక ఉష్ణోగ్రత స్వల్పంగా పెరిగింది. ఆ తర్వాత అంతా చక్కబడింది. ఇప్పుడు ఆమె బాగానే ఉంది. కరోనాపై పోరాడే యాంటీబాడీలు ఆమెలో ఎక్కువగానే ఉత్పత్తయ్యాయి’’ అని పేర్కొన్నారు. సమీప భవిష్యత్‌లో ఈ టీకాను రష్యా భారీగా ఉత్పత్తి చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

*రెండుచోట్ల ఉత్పత్తి* స్పుత్నిక్‌-వి టీకాను గమలేయా పరిశోధన సంస్థ, బినోఫార్మ్‌ ఉత్పత్తి చేస్తాయని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్‌ మురాష్కో తెలిపారు. దీనిపై అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. టీకాను షరతులతోనే రిజిస్టర్‌ చేశామని, ఒకపక్క ఉత్పత్తి జరుగుతుండగా మరోపక్క ప్రయోగాలు కొనసాగాలని చెప్పినట్లు వివరించారు. ఈ టీకాను తమ దేశంలో మొదట వైద్యులు, టీచర్లు, రిస్కు ఎక్కువగా ఉన్న ఇతర వర్గాలవారికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ టీకా 2021 జనవరి 1 నుంచి పౌరులకు అందుబాటులోకి వస్తుందని రష్యా ‘స్టేట్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్స్‌’ వెబ్‌సైట్‌ పేర్కొంది.

*రెండేళ్ల పాటు రక్షణ..* ఈ టీకాను గామలేయ పరిశోధన సంస్థ, రష్యా రక్షణ మంత్రిత్వశాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ వ్యాక్సిన్‌లో వేరువేరుగా ఇంజెక్ట్‌ చేసే రెండు భాగాలు ఉంటాయి. ఇవి ఉమ్మడిగా.. వైరస్‌ నుంచి దీర్ఘకాల రక్షణ కల్పిస్తాయని చెబుతున్నారు. రెండేళ్ల వరకూ కరోనా నుంచి రక్షణ లభిస్తుందని రష్యా ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. అడినోవైరస్‌ ఆధారంగా ఈ టీకాను అభివృద్ధి చేసినట్లు గమాలెయా జాతీయ పరిశోధన కేంద్రం డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ గింట్స్‌బర్గ్‌ తెలిపారు. స్పుత్నిక్‌-విపై జూన్‌ 18న క్లినికల్‌ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి.

*ఏమిటీ హడావుడి?* హడావుడిగా కరోనా టీకా విడుదలకు రష్యా పూనుకోవడం ప్రమాదకరమని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. టీకాలు, ఔషధాలకు పట్టే క్లినికల్‌ ప్రయోగాల సమయాన్ని కుదించాలని ఏప్రిల్‌లో పుతిన్‌ ఆదేశించడాన్ని వారు ప్రస్తావించారు. సైన్స్‌, భద్రతను తోసిరాజంటూ జాతీయ ప్రతిష్ఠకు పెద్దపీట వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో అంటువ్యాధుల నిపుణుడైన ఆంటోనీ ఫౌచీ ఇదే విషయాన్ని ఇటీవల ప్రస్తావించారు.

‘‘టీకాపై రష్యా, చైనా పరిశోధకులు సరైన ప్రయోగాలు నిర్వహిస్తున్నారని ఆశిస్తున్నా. ప్రయోగాలు చేపట్టకుండానే వ్యాక్సిన్‌ను పంపిణీకి సిద్ధం చేయడం సమస్యలకు దారితీస్తుంది’’ అని చెప్పారు. టీకాను విడుదల చేయడానికి ముందు అన్ని దశల్లో దాన్ని పూర్తిస్థాయిలో పరీక్షించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కోరింది. రష్యా టీకా ప్రయోగ ఫలితాలు ఎక్కడా వెల్లడి కాలేదని కూడా నిపుణులు విమర్శిస్తున్నారు.

*భారీ గిరాకీ* వంద కోట్ల డోసుల స్పుత్నిక్‌-వి టీకా కోసం లాటిన్‌ అమెరికా, పశ్చిమాసియా, ఆసియాలోని 20 దేశాల నుంచి విజ్ఞప్తి వచ్చినట్లు ఆర్‌డీఐఎఫ్‌ అధిపతి కిరిల్‌ దిమిత్రియేవ్‌ పేర్కొన్నారు. ఐదు దేశాల్లోని భాగస్వామ్య సంస్థల సాయంతో 50 కోట్ల డోసుల ఉత్పత్తికి సిద్ధమన్నారు. యుఏఈ, సౌదీ అరేబియా, ఇతర దేశాల్లో ఈ టీకాపై మూడో విడత క్లినికల్‌ ప్రయోగాల కోసం ఏర్పాట్లు చేశామన్నారు.

ఈ టీకా ఉత్పత్తి సెప్టెంబర్‌ నుంచి ఆరంభం కావొచ్చని చెప్పారు. స్పుత్నిక్‌-విపై ఆసక్తి చూపుతున్న దేశాల్లో భారత్‌ కూడా ఉన్నట్లు సమాచారం. రష్యా ఇవ్వజూపుతున్న కరోనా టీకాను స్వీకరించేందుకు తాము సిద్ధమని ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె చెప్పారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights