విమాన ప్రయాణాల్లో కరోనాపై కొత్త నిబంధన

*విమాన ప్రయాణాల్లో కరోనాపై కొత్త నిబంధన*
విమాన ప్రయాణం చేయాలనుకునేవారికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కాస్త వెసులుబాటు కలిగించే నిర్ణయం తీసుకుంది. ప్రయాణ తేదీకి ముందు మూడు వారాల వ్యవధిలో తమకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ రాలేదని స్వీయ ధ్రువీకరణ పత్రం అందజేస్తే చాలు..
వారిని విమానం ఎక్కడానికి అనుమతిస్తారు. కరోనా బారినపడి కోలుకున్నవారికీ ఈ వెసులుబాటు ఉంటుంది. వారు కొవిడ్‌కు చికిత్స తీసుకున్నట్లు ఆసుపత్రి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది.
ఈమేరకు విమాన సంస్థలకు మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. గతంలో ప్రయాణ తేదీకి ముందు రెండు నెలల వ్యవధిలో కరోనా పాజిటివ్ రాలేదని ప్రయాణికులు స్వీయ ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉండేది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
