మరింత క్షీణించిన మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్యం

Teluguwonders:
చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కిడ్నీ సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్న మాజీ ఎం.పీ శివ ప్రసాద్ కి వెంటిలేటర్‌పై చికిత్స , వైద్యసహాయం అందిస్తున్నారు. ఆయన ను పరా మర్శించడానికినేడు సాయంత్రం చంద్రబాబు చెన్నై వెళ్లనున్నారు .
🔴వివరాల్లోకి వెళ్తే :
చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు, సినీ నటుడు నారమల్లి శివప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించిందని సమాచారం. ప్రస్తుతం ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతమవుతున్న శివప్రసాద్ కిడ్నీ సంబంధిత సమస్య తలెత్తడంతో రెండు రోజుల క్రితమే చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు.
అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని సమాచారం. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శివప్రసాద్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరాతీస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన చెన్నై వెళ్లి శివప్రసాద్‌ను పరామర్శించనున్నారు. 2009, 2014లో చిత్తూరు నుంచి రెండుసార్లు టీడీపీ ఎంపీగా గెలిచిన శివప్రసాద్ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
🔴 నారమల్లి శివప్రసాద్ :
రెండుసార్లు చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. 2009, 2014లో ఆయన చిత్తూరు ఎంపీగా ఉన్నారు.
💥ప్రత్యేక శైలితో :
స్వతహాగా నటుడైన శివప్రసాద్ తన నిరసనలను కూడా అదే రీతిలో తెలిపారు. ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ.. రకరకాల వేషధారణల్లో నిరసన లు తెలిపేవారు.అలా ప్రత్యేక హోదా ఉద్యమంలో తనదైన ప్రత్యేక శైలితో ఆకట్టుకున్నారు. దీంతో ఓ దశలో ఆయన జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
