నేడే స్త్రీ(ఫ్రీ) శక్తి..

మహిళలకు ఉచిత బస్సు అమలు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని మదనపల్లె-1, మదనపల్లె-2, పీలేరు, రాయచోటి, రాజంపేట డిపోల్లో అవసరమైన సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేశారు.
కలికిరి(కడప): మహిళలకు ఉచిత బస్సు అమలు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని మదనపల్లె-1, మదనపల్లె-2, పీలేరు, రాయచోటి, రాజంపేట(Rayachoti, Rajampet) డిపోల్లో అవసరమైన సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేశారు. అన్ని ఆర్టీసీ డిపోల్లోని ఐదు రకాల బస్సు సర్వీసుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నారు. పల్లె వెలుగు, అలా్ట్ర పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ లు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మాత్రం ఈ సౌకర్యం కల్పిస్తున్నారు.
ఇక అలా్ట్ర డీలక్స్, సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, స్టార్ లైనర్, ఏసీ బస్సులను ఉచిత ప్రయాణానికి మినహాయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిర్దేశిత బస్సుల్లో వెళ్లేందుకు వెసులుబాటున్నా తిరుపతి నుంచి తిరుమలకు మాత్రం ఉచిత ప్రయాణం లేనట్టే. ప్రతి డిపోలోనూ బస్సుల సంఖ్య పెరగనున్న దృష్ట్యా సిబ్బం ది కొరత లేకుండా ఆన్ కాల్ విధానంలో డ్రైవర్లను నియమించారు. జిల్లాలోని మహిళలందరితో పాటు ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నారు.
రోజూ 65 నుంచి 70 శాతం మహిళా ప్రయాణీకులు ప్రయాణించనున్నారని ఆర్టీసీ అంచనా వేస్తోంది. జిల్లాలోని ఐదు బస్సు డిపోలకు ఏడాదికి కనీసం రూ.70 కోట్ల మేర ఉచిత ప్రయాణ భారం పడుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వైపు ఉచిత ప్రయాణంతో ఒక్కో కుటుంబానికి రూ.800 నుంచి 3 వేల వరకు నెలకు ఆదా అవుతుందని కూడా అంచనాగా ఉంది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
