గద్దలకొండ గణేష్ (వాల్మీకి ) ట్విట్టర్ రివ్యూ

Galadakonda Ganesh (Valmiki) Twitter Review

Teluguwonders:

గద్దలకొండ గణేష్‌గా వరుణ్ తేజ్ మాస్ అవతారం:

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గద్దలకొండ గణేష్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించారు. తమిళ నటుడు అధర్వా మురళి కీలక పాత్ర పోషించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గద్దలకొండ గణేష్’గా పేరు మార్చుకున్న వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ సినిమా ఫస్ట్ టాక్ బయటికి వచ్చింది. యూస్‌లో ప్రీమియర్లు చూసిన చాలా మంది ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

💥Highlights :

 హరీష్ శంకర్ రాసిన డైలాగులు థియేటర్‌లో బాగా పేలాయని మరికొందరు అంటున్నారు. తెలంగాణ యాసలో మాస్ డైలాగులను వరుణ్ తేజ్ సూపర్బ్‌గా చెప్పారట. దీనికి తోడు మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం సినిమాకు మరో బలమని చెబుతున్నారు. ఫస్టాఫ్ చాలా బాగుందని, ఇంటర్వెల్ బ్లాక్ ట్విస్ట్ అదిరిపోయిందని ట్వీట్లు చేస్తున్నారు. మొత్తంగా ‘‘సూపర్ హిట్టు బొమ్మ హిట్టు’’ అనే టాక్ బాగా వినిపిస్తోంది.

వాస్తవానికి మొదట ఈ చిత్రానికి ‘వాల్మీకి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇదే టైటిల్‌తో సెన్సార్ కూడా పూర్తిచేసుకుంది. కానీ, సినిమా టైటిల్‌ను మార్చాలంటూ బోయ, వాల్మీకి సంఘాలు ఆందోళనకు దిగడం.. ఆఖరి నిమిషంలో కర్నూలు, అనంతపురం జిల్లాల కలెక్టర్లు ఈ సినిమా విడుదల ఆపాలని ఆదేశించడంతో తప్పని పరిస్థితుల్లో దర్శక, నిర్మాతలు టైటిల్‌ను ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు టైటిల్ మార్చాల్సిరావడం బాధాకరం. అయినప్పటికీ ‘గద్దలకొండ గణేష్’కి వచ్చిన ఇబ్బందేమీ లేదు.

ఇప్పటికే ‘గద్దలకొండ గణేష్’ ప్రీమియర్ షోలు యూఎస్‌లో ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమాను చూసిన కొంత మంది ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తు్న్నారు. సినిమా సూపర్ హిట్ అంటున్నారు. వరుణ్ తేజ్ అయితే ఇరగదీశారట. గద్దలకొండ గణేష్ పాత్రలో ఆయన నటన, మేనరిజం, డైలాగ్ కమాండ్ అరాచకం అంటున్నారు. హరీష్ శంకర్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని కొంతమంది ట్వీట్లు చేస్తున్నారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights