GMC Balayogi 68th birth anniversary .. chandrababu get emotion

సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించి లోక్ సభ స్పీకర్ స్థాయికి ఎదిగి, విపక్షాల మన్ననలు కూడా పొందిన జిఎంసి బాలయోగిగారు నాకు అత్యంత ఆత్మీయుడు. కోనసీమ అభివృద్ధికి బాలయోగి చేసిన కృషి ఆయనను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపింది. ఆయన జయంతి సందర్భంగా ఆ ప్రజానేత సేవలను స్మరించుకుందాం.
దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన సేవలను సర్మించుకున్నారు. సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించిన బాలయోగి స్పీకర్ స్థాయికి ఎదిగారని కొనియాడారు. బాలయోగి తనకు అత్యంత ఆత్మీయుడన్న చంద్రబాబు.. కోనసీమ అభివృద్ధికి బాలయోగి చేసిన కృషి ఆయనను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపిందన్నారు.
బాలయోగి జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ట్విట్ చేశారు. ‘‘కోనసీమలోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి, అంచెలంచెలుగా ఎదిగి లోక్ సభ స్పీకర్ గా ఆ పదవికే వన్నెతెచ్చిన నాయకుడు, బడుగు బలహీన వర్గాల బంధువు, స్వర్గీయ గంటి మోహన చంద్ర బాలయోగిగారి జయంతి సందర్భంగా ఆ ప్రజానేత స్మృతికి నివాళులర్పిస్తున్నాన’’ని ఆయన ట్వీట్ చేశారు.
source:https://telugu.samayam.com/andhra-pradesh/news/tdp-chief-chandrababu-naidu-and-nara-lokesh-tributes-to-former-ls-speaker-gmc-balayogi-on-his-birth-anniversary/articleshow/71385171.cms
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
