కేవలం 13 రోజుల్లోనే భారీగా తగ్గిన బంగారం ధర.. వెండి ఎంత తగ్గిందో తెలుసా?

Gold and Silver Price: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా దిగి వస్తున్నాయి. అయితే గత 13 రోజులుగా ధరలను పరిశీలిస్తే భారీగా తగ్గుముఖం పడుతున్నాయి..
Gold and Silver Price: బంగారం, వెండి ధరల పెరుగుదల వినియోగదారులకు పెద్ద షాక్ ఇస్తోంది. అయితే ప్రస్తుతం దిగి వస్తోంది. నిన్నటితో పోలిస్తే తులం బంగారంపై రూ.280 తగ్గుముఖం పట్టింది. గతంలో తులం బంగారం ధర రూ.1 లక్ష 32 వేలు దాటింది. ఇక వెండి ధర కిలోకు రెండు లక్షల చేరువులోకి వెళ్లింది. ప్రస్తుతం ఇది కూడా భారీగానే దిగి వస్తోంది. కానీ గత 13 రోజుల్లో రెండు లోహాలలో గరిష్ట తగ్గుదల నమోదైంది. ఈరోజు ఉదయం సెషన్‌లో గుడ్‌రిటర్న్స్ ప్రకారం.. వెండి ధర రూ. 1 లక్ష 52 వేల, బంగారం ధర 10 గ్రాములకు రూ. 1 లక్ష 23 వేల వరకు ఉంది. గత 13 రోజుల్లో, వెండి 25 వేలకు పైగా, బంగారం రూ. 10 వేల వరకు తగ్గివంది.
ఇక ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, బంగారం, వెండి తగ్గుముఖం పడుతున్నాయి. గత నెల అక్టోబర్ 31న, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,620, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,09,570. 18 క్యారెట్ల బంగారం ఇప్పుడు రూ.89,710. ఉంది. నవంబర్ 1న తులం ధర రూ.1లక్షా 23 వరకు ఉంది. ఫ్యూచర్స్ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం మరియు వెండిపై పన్ను లేదా సుంకం లేదు. అయితే, సుంకాలు, పన్నులు బులియన్ మార్కెట్‌లో చేర్చనందున ధరల్లో్ తేడా ఉండవచ్చు.
బంగారం ధర ఎందుకు తగ్గింది?
ధంతేరస్, దీపావళి వంటి పండుగల సమయంలో బంగారం, వెండి డిమాండ్ తగ్గింది. కొనుగోలుదారులు పెట్టుబడులు ఉపసంహరించుకోవడం బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపింది. లాభాల స్వీకరణ కూడా అమ్మకాలు పెరగడానికి దారితీసింది. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (RSI) వంటి సాంకేతిక సూచికల ప్రకారం.. ట్రెండ్ ఫాలోవర్లు, డీలర్లు పెద్ద మొత్తంలో బంగారం, వెండిని విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించారు. ఫలితంగా, రెండు లోహాల ధరలు పడిపోయాయి. భౌగోళిక రాజకీయ పరిణామాలు సడలించాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కాకుండా, ప్రపంచంలో శాంతి నెలకొని ఉంది. ఇది బంగారం డిమాండ్‌ను ప్రభావితం చేసింది. బంగారంలో పెట్టుబడి సురక్షితమైనదిగా పరిగణిస్తారు. ఆర్థిక సంక్షోభాల సమయంలో బంగారం విలువ పెరుగుతోంది.
ఈ సంవత్సరం ధరలు ఎంత పెరిగాయి?
ఈ సంవత్సరం ఇప్పటివరకు బంగారం ధర రూ.43,091 పెరిగింది. డిసెంబర్ 31, 2024న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.76,162గా ఉంది. అక్టోబర్ 31 నాటికి 10 గ్రాములకు రూ.1,23,000 వరకు చేరింది. వెండి ధర రూ.59,583 పెరిగింది. డిసెంబర్ 31, 2024న ఒక కిలో వెండి ధర రూ.86,017గా ఉంది. ఇప్పుడు ఈ ధర కిలోకు రూ.1,50,000 వరకు ఉంది. ఇక గత 13 రోజుల్లో అంటే అక్టోబర్ 31 వరకరు వెండి 25 వేలకు పైగా, బంగారం రూ.10,246 తగ్గాయి.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
