జియో కస్టమర్లకు మరో శుభవార్త

jio-prime-prepaid-postpaid-tariff-plans

రిలయన్స్ జియో తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. తమ కస్టమర్లకు ప్రైమ్ మెంబర్‌షిప్ సబ్‌స్క్రిప్షన్ మరో ఏడాది పాటు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. అంటే సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు పొడిగించింది. దీంతో జియో యూజర్లు ప్రైమ్ సభ్యత్వం కింద ఏడాది పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో క్లౌడ్ వంటి సేవలు ఉచితంగా పొందవచ్చు.

🔸ప్రైమ్ మెంబర్‌షిప్ పొడిగింపు :

జియో ప్రైమ్ మెంబర్‌షిప్ సభ్యత్వం ఖరీదు ఏడాదికి రూ.99. అయితే ఉచితంగానే పొడిగిస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇప్పటి వరకు జియో మెంబర్‌షిప్ ఏడాది మాత్రమే ఉండేది. తమ యూజర్ల కోసం ఇప్పుడు జియో ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా మరో ఏడాది వరకు ఫ్రీగా ఆటో రెన్యూవల్ అయ్యే అవకాశాన్ని కల్పించింది.

🔸ప్రైమ్ మెంబర్షిప్ రెండుసార్లు పొడిగింపు:

2016లో కార్యకలాపాలు మొదలుపెట్టిన జియో ఆరు నెలల వరకు ఉచిత కాల్స్, డేటా సేవలు అందించింది. ఆ తర్వాత ఉచిత సేవలను ఆపేసి ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్‌ను తీసుకు వచ్చింది. అయితే ఇప్పటికే సభ్యత్వాన్ని రెండుసార్లు పొడిగించింది.

🔸మీ మెంబర్‌షిప్ రెన్యూవల్ తెలుసుకునేందుకు ఇలా ;

👉మీ స్మార్ట్‌ఫోన్‌లోని MyJio యాప్‌ను ఓపెన్ చేయండి.

👉మెనూ ఆప్షన్ లెఫ్ట్ లెఫ్ట్ కార్నర్‌ను ట్యాప్ చేయండి.

👉My Plans సెక్షన్‌లోకి వెళ్లండి. అక్కడ మీకు ప్లాన్స్ కనిపిస్తాయి. యాడ్ ఆన్ ప్యాక్స్ కూడా ఉంటాయి.

👉Jio Prime Membership బార్ కూడా కనిపిస్తుంది.

👉మీ జియో మెంబర్‌షిప్ రెన్యూవల్ అయి ఉంటే ‘Your request to avail free JioPrime membership for a year has been registered successfully. You can now enjoy JioPrime benefits for another year. Thank You!’ అని మెసేజ్ ఉంటుంది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights