Google Recovery: ఫోన్ పోయినా డేటా మాత్రం సేఫ్! గూగుల్ కొత్త ఫీచర్! ఎలా ఎనేబుల్ చేయాలంటే..

సాధారణంగా మొబైల్ లో ఫొటోల నుంచి కాంటాక్ట్స్ వరకూ ముఖ్యమైన పర్సనల్ డేటా అంతా గూగుల్ అకౌంట్ లోనే సేవ్ అవుతుంటుంది. మొబైల్ పోయినా లేదా పాస్ వర్డ్ మర్చిపోయినా అప్పుడు ఆ డేటా అంతా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అయితే ఇకపై అలా జరగకుండా గూగుల్ కొత్త ఫీచర్ తెస్తోంది. అదేంటంటే.
మొబైల్ కు ఏం జరిగినా అందులోని గూగుల్ అకౌంట్ తో లింక్ అయ్యి ఉన్న డేటా మాత్రం పోకుండా గూగుల్ కొత్త ఫీచర్ తెస్తోంది. అదే గూగుల్ రికవరీ కాంటాక్ట్. ఈ ఫీచర్ ద్వారా పాస్ వర్డ్ మర్చిపోయినా లేదా ఫోన్ పోయినా డేటా పోతుందనే భయం లేదు. ప్రస్తుతం గూగుల్ సెట్టింగ్స్ లో రికవరీ ఇమెయిల్, రికవరీ ఫోన్ నంబర్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. అయితే వీటి వల్ల పూర్తిగా అకౌంట్ సేఫ్ అని చెప్పలేం. ఇవి ఉన్నప్పటికీ సిమ్ స్వాప్, ఫిషింగ్ వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు గూగుల్ రికవరీ కాంటాక్ట్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
రికవరీ కాంటాక్ట్
గూగుల్ కొత్తగా తెచ్చిన రికవరీ కాంటాక్ట్ ఫీఛర్.. ద్వారా ఎప్పుడైనా మీ మొబైల్ కోల్పోయినా, పాడయినా లేదా పాస్ వర్డ్ మర్చిపోయినా.. మీ డేటాను కోల్పోకుండా తిరిగి పొందొచ్చు. అంతేకాకుండా మీ అకౌంట్ ను తిరిగి పొందడానికి కూడా ఈ ఆప్షన్ సహకరిస్తుంది. ఈ ఫీచర్‌లో భాగంగా మీరు మీ గూగుల్ అకౌంట్ కు.. రికవరీ అకౌంట్ కింద మీ స్నేహితుల లేదా బంధువుల అకౌంట్ ను యాడ్ చేసుకోవచ్చు. తద్వారా ఎప్పుడైనా మీ అకౌంట్ ను యాక్సెస్ చేయలేకపోయినప్పుడు ఈ రికవరీ కాంటాక్ట్ సహాయంతో మీ అకౌంట్ తిరిగి పొందొచ్చు. మీరు యాడ్ చేసిన రికవరీ కాంటాక్ట్ కు వచ్చే వెరిఫికేషన్ కోడ్ ద్వారా మీరు మీ అకౌంట్ లోకి మళ్లీ లాగిన్ అవ్వగలరు.
సెట్టింగ్ ఇలా..
గూగుల్ రికవరీ కాంటాక్ట్ ఫీచర్ ను ఎనేబుల్ చేయడం కోసం ముందుగా గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్ కు వెళ్లి సెక్యూరిటీ ట్యాబ్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ కనిపిస్తున్న రికవరీ ఆప్షన్‌లోకి వెళ్లి మీరు కొత్త రికవరీ కాంటాక్ట్‌ను యాడ్ చేసుకోవచ్చు. ముందుగా మీరు మీ ఫ్రెండ్స్ అకౌంట్ ను ఇన్విటేషన్ పంపాలి. దాన్ని వాళ్లు యాక్సెప్ట్ చేసిన వెంటనే వాళ్లు మీ రికవరీ కాంటాక్ట్‌గా యాడ్ అవుతారు. ఇలా రికవరీ కాంటాక్ట్స్ కింద 10 మందిని ఎంచుకోవచ్చు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
