మహా నటి.. మరీ ఇలా తయారయ్యిందేంటి…?

మన తెలుగు ప్రేక్షకులలో కొంతమందికి హీరోయిన్స్ బొద్దుగా ఉంటేనే ముద్దు.గతం లో జయ లలిత, సావిత్రి,సౌందర్య,ఆర్తి అగర్వాల్ ఇలా బొద్దుగా ఉండే హీరోయిన్లను మన వాళ్ళు విపరీతంగా అభిమానించే వారు. ‘నేను శైలజ’ చిత్రంతో మంచి నటిగా పేరు తెచ్చుకున్న మలయాళ ముద్దుగుమ్మ కీర్తి కూడా కాస్త బొద్దుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఒకరకంగా కీర్తి సురేష్ ‘మహానటి’ తర్వాత మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.
👉మహా నటి స్లిమ్ అయ్యింది : ఇదిలా ఉంటే కీర్తి సురేష్ తన కొత్త లుక్ తో ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. తన కెరీర్ మొదటి నుంచి కూడా కీర్తి మరీ స్లిమ్ముగా ఏమీ ఉండేది కాదు. కానీ ఈమధ్య కాస్త వెయిట్ పెరగడంతో మళ్ళీ గ్లామరస్ లుక్స్ పై ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. మహానటి గట్టిగా ఫోకస్ చేస్తే సాధించలేనిది ఏముంది? అతి తక్కువ సమయంలోనే స్లిమ్ముగా మారిపోయింది. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్లకు పోటీ అన్నట్టుగా ఇప్పుడు జీరో సైజ్ లోకనిపిస్తోంది.
🔴కొంత గ్యాప్ తర్వాత కీర్తి ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడని సమాచారం.
కీర్తి ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే మలయాళంలో మోహన్ లాల్ సినిమా ‘మరక్కార్: అరబికడలంటే సింహం’ లో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా అజయ్ దేవగణ్ నటించనున్న ఒక బయోపిక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందని టాక్ ఉంది. ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కు 1953 నుండి 1963 వరకూ కోచ్ గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ బయోపిక్ రూపొందుతోంది. ‘బధాయి హో’ ఫేం అమిత్ శర్మ దర్శకుడు. అసలు ఈ స్లిమ్ మేకోవర్ బాలీవుడ్ కోసమే అనే గుసగుసలు కూడా ఉన్నాయి.
🤔అయితే కీర్తి మరీ బక్కగా ఉందని వాళ్ళ అభిమానులు ఫీల్ అవుతారో ఏమో!
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
