‘నా జీవితం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం..’ పార్టీ నిర్ణయం శిరోధార్యంః హరీష్‌ రావు

harish-rao

కవిత వ్యాఖ్యలను లైట్ తీసుకున్న హరీష్‌.. ప్రజల కష్టాలపైనే తమ ఫోకస్‌ ఉంటుందని ఎయిర్‌పోర్టులో స్పందించారు. రాష్ట్ర సాధనలో నా నిబద్ధత, పాత్ర అందరికీ తెలిసిందే అని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రెండున్నర దశాబ్దాలుగా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఉన్నానని, ఎవరి విషయంలోనైనా పార్టీ నిర్ణయమే ఫైనల్. పార్టీకి కేసీఆరే సుప్రీం అని స్పష్టం చేశారు.

విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు.. తనపై కవిత చేసిన ఆరోపణలపై స్పందించారు. నా జీవితం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం అన్నారు. కొందరు నాయకులు, పార్టీలు చేసిన ఆరోపణలే కవిత చేశారు. కవిత వ్యాఖ్యలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా అని హరీష్‌ రావు తెలిపారు. కవిత విషయంలో పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుందని హరీష్ గుర్తు చేశారు.

కవిత వ్యాఖ్యలను లైట్ తీసుకున్న హరీష్‌.. ప్రజల కష్టాలపైనే తమ ఫోకస్‌ ఉంటుందని ఎయిర్‌పోర్టులో స్పందించారు. రాష్ట్ర సాధనలో నా నిబద్ధత, పాత్ర అందరికీ తెలిసిందే అని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రెండున్నర దశాబ్దాలుగా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఉన్నానని, ఎవరి విషయంలోనైనా పార్టీ నిర్ణయమే ఫైనల్. పార్టీకి కేసీఆరే సుప్రీం అని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ను తిరిగి అధికారంలోకి తెస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు.

మరోవైపు రేవంత్ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. ఎరువుల దొరకక రైతులు గోస పడుతున్నారు. వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దకాలం మేం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను.. ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలుస్తూ వస్తుందని హరీష్‌ రావు విమర్శించారు. తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే మా లక్ష్యమని హరీష్ అన్నారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని హరీష్ ధీమా వ్యక్తం చేశారు.

ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా హైదరాబాద్‌లోని తన నివాసానికి వెళ్లిన హరీష్‌రావు.. అక్కడి నుంచి పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లనున్నారు. విదేశీ పర్యటన తర్వాత శనివారం (సెప్టెంబర్ 6) ఎర్రవెల్లికి వెళ్లనున్నారు హరీష్‌రావు. ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కవిత వాఖ్యలపై కేసీఆర్‌తో చర్చించనున్నారు హరీష్‌. కేసీఆర్‌తో చర్చించాక ఎలా స్పందిస్తారో అన్నదీ ఉత్కంఠగా మారింది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights