వేప చెట్టును ఆరోగ్య ప్రధాయినిగా పరిగణిస్తూ ఉంటారు. ఎందుకంటే వేప ఆకులు, బెరడు, వేప పువ్వు, వేప నూనె… ఇలా వేపచెట్టుకు సంబంధించిన ప్రతిదానిని వివిధ రోగాలకు మెడిసన్ తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. చర్మ వ్యాధులు, అజీర్తి, జుట్టు సమస్యలు, దంత సమస్యలు ఇలా చాలా రకాల ఆరోగ్య సమస్యలకు వేప చేట్టే ప్రధాన ఆధారం. కాగా ప్రతిరోజూ వేపరసం తాగితే ఎన్నో రోగాలు పరార్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. వేప ఆకులలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేపరసాన్ని తాగితే కడుపులోని మలినలు తోలగిపోతాయి..
ఇంకా మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. పేగులకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాటిని నివారిస్తుంది. వివిధ రకాల క్యాన్సర్ రోగాల బారిన పడకుండా చూస్తుంది. వేపలో అస్టృంజెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి గ్యాస్, ఉబ్బరం, వంటి సమస్యలను తగ్గించి జీర్ణ శక్తిని మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోని టాక్సీన్లను బయటకు పంపడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇంకా నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అనగా నోటి దుర్వాసన, నోటిపుండ్లు వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో యాంటీ యాంటీ బ్యాక్టీరియాల్ కారణంగా చర్మంపై ఏర్పడే దద్దుర్లు, మొటిమలు వంటి వాటిని తగ్గిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు వేపరసం ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచడంతో పాటు మధుమేహ సంబంధిత వ్యాధులను ఎదుర్కోవడానికి తగిన శక్తిని ఇస్తుంది.
కాబట్టి ప్రతిరోజు ఉదయం పడగడుపున వేపరసం తాగడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుయితున్నారు. ఇంతకీ వేప రసం ఎలా తయారు చేసుకోవాలంటే.. తాజాగా ఉండే 5-6 వేపాకులను మెత్తగా గ్రైండ్ చేసుకొని దానిలో ఒక గ్లాస్ నీరు కలుపుకొని ఆ తరువాత వడకట్టి ఆ రసాన్ని తాగాలి. ఇక మరో పద్దతిలో కూడా వేపరసం తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెలో మంచి నీరు తీసుకొని అందులో వేప ఆకులను వేసి మరిగించి చల్లర్చిన తరువాత ఆ నీరు త్రాగలి. అయితే వేప రసం మితంగానే తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ప్రతిరోజూ 10-20 మిల్లీ లీటర్ల వేపరసం తీసుకుంటే మంచిదని చెబుతున్నారు నిపుణులు అంతకంటే ఎక్కువ తీసుకుంటే వాంతులు అయ్యే ప్రమాదం ఉండని నిపుణులు చెబుతున్నా మాట.
Ref: https://greattelangaana.com/neem-juice-uses/
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.