భూతల స్వర్గమే పహల్గామ్.. పర్యాటకులను ఆకర్షించే అందం, ఆధ్యాత్మిక ప్రదేశాలు దీని సొంతం..

pahalgam-1-1

కాశ్మీర్‌లోని పహల్గామ్ ఖచ్చితంగా పర్యాటకుల పర్యటన జాబితాలో ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రదేశం అంత అందంగా ఉంటుంది. పైన్ అడవులు, రాళ్ల మీదుగా ప్రవహించే స్వచ్ఛమైన నది నీరు, పచ్చని గడ్డి భూములు, చుట్టూ ఉన్న ఎత్తైన పర్వతాలతో ప్రకృతి ప్రేమికుల హృదయాన్ని దోచుకుంటాయి. ఈ రోజు పహల్గామ్ లోని ఆరు అందమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

 

భూమిపై స్వర్గంగా పిలువబడే కాశ్మీర్ చాలా అందంగా ఉంటుంది. హిమాలయ పర్వత సానువుల్లో ఉండే ఈ ప్రాంతం అందం కవులకు సైతం మాటల్లో వర్ణించడం కష్టం అని అంటారు. పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా నిలిచే కొన్ని ఉత్తమ గమ్యస్థానాలున్నాయి. అలాంటి ప్రదేశాలలో పహల్గామ్ ఒకటి. పహల్గామ్ ప్రకృతి అందాలను చూసిన వారికీ ఎవరికైనా అక్కడే స్థిరపడాలని అనిపిస్తుంది. విశాలమైన గడ్డి భూములు, ఎత్తైన శిఖరాలు, స్వచ్చంగా ప్రవహించే నది, పచ్చని లోయలు… ఇక్కడి వీచే గాలి.. ప్రశాంత మైన వాతావరణం ప్రతి ఒక్కరినీ అంతర్గత శాంతితో నింపుతుంది. ముఖ్యంగా పహల్గామ్ పైన్ అడవులకు ప్రసిద్ధి చెందింది. ప్రకృతి సౌందర్యమే కాదు ఇక్కడ ప్రజలను ఆకర్షించే ప్రదేశాలు చాలా ఉన్నాయి.

మంచుతో కప్పబడిన పర్వతాలను చూడాలనుకోవచ్చు లేదా తేమతో కూడిన వేడి నుంచి ఉపశమనం కోసం పర్వతాల నుంచి వీచే తాజా గాలిలో ప్రశాంతమైన క్షణాలు గడపాలని అనుకోవచ్చు. కాశ్మీర్ ప్రతి సీజన్‌లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశం. ప్రస్తుతానికి కాశ్మీర్‌లోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటైన పహల్గామ్ గురించి తెలుసుకుందాం.

ఇతర వన్యప్రాణుల అభయారణ్యాలు: పహల్గామ్ లో రక్షిత ప్రాంతమైన అరు వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. ఇది సహజ సౌందర్యానికి, వివిధ రకాల వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం వన్యప్రాణులకు, ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గం లాంటిది. హంగుల్, గోధుమ ఎలుగుబంటి, చిరుతపులి నుంచి కస్తూరి జింక వరకు ఇక్కడ అనేక వన్యప్రాణులు ఉన్నాయి. అంతేకాదు ఈ అభయారణ్యంలో అనేక రకాల పక్షులు నివసిస్తున్నాయి.

బైసరన్ లోయ: బైసరన్ లోయ సహజ సౌందర్యం కారణంగా దీనిని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం పహల్గామ్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ విశాలమైన గడ్డి భూములు, దట్టమైన పైన్ అడవులు . ఎత్తైన మంచుతో కప్పబడిన శిఖరాలను చూసినవారికి తాము కలల అందమైన ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది.

కోలహోయ్ హిమానీనదం: పహల్గామ్ సమీపంలోని లిడ్డర్ లోయ పైన ఉన్న కోలాహోయ్ హిమానీనదం ఒక ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశం. ఇక్కడి దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. లిడ్డర్ నది ఇక్కడే ఉద్భవించింది. ప్రకృతి ప్రేమికులకు, సాహసయాత్రలు ఇష్టపడే వారికి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది.

 

 


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights