ఉపరాష్ట్రపతికి అత్యున్నత పురస్కారం

ఆఫ్రికాలోని కొమొరోస్‌లో పర్యటిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు అరుదైన గౌరవం లభించింది. అక్కడి ప్రభుత్వం కొమొరోస్ అత్యున్నత పౌర పురస్కారం ద ఆర్డర్ ఆఫ్ ద గ్రీన్ క్రెసెంట్ ప్రకటించింది. కొమొరోస్ అధ్యక్షుడు అజాలీ అసౌమని చేతుల మీదుగా వెంకయ్య ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ కొమొరోస్ పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. 130 కోట్ల మంది భారతీయు తరపున దీన్ని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. భారత్- కొమొరోస్ మైత్రికి గుర్తుగా ద ఆర్డర్ ఆఫ్ ద గ్రీన్ క్రెసెంట్ అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. సంయుక్త లక్ష్యమే మమ్మల్ని కలిపింది. ఇరుదేశాలను కలిపే సముద్రం కూడా ఒక్కటే. సముద్రమంత స్నేహమిది. పరస్పర పురోగతికి స్వప్నమిది అని అన్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
