హెచ్ 1బీ వీసాపై అమెరికా కీలక నిర్ణయం

అగ్రరాజ్యంలో ఉద్యోగానికి అవసరమైన హెచ్1బీ వీసా విషయంలో యూఎస్ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగంలో చేరే తేదీకి కనీసం 90 రోజుల ముందే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. అమెరికాలో వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఉద్యోగంలో చేరే తేదీకి 90 రోజుల ముందు నుంచే ఐ- 797 ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని ట్వీటింది. ఇక ఐ-797 ఫారం అనేది దరఖాస్తుదారులు/ పిటిషనర్లతో కమ్యూనికేట్ చేయడానికి లేదా ఇమిగ్రేషన్ ప్రయోజనాన్ని తెలియజేయడానికి యూఎస్ సిటీజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) ఉపయోగించే పత్రం. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం యూఎస్‌సీఐఎస్ వైబ్‌సైట్‌లో చూడొచ్చు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
