కొత్త రేషన్ కార్డు కావాల్సిన వారు ఇలా అప్లై చేసుకోండి

[the_ad id=”4846″]
మరికొద్ది రోజుల్లో కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇటీవల ఎన్నికలు రావడంతో కొత్త రేషన్ కార్డు ప్రక్రియ నిలిపివేశారు.ఎన్నికల కోడ్ ముగియడంతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ జోరందుకోనుంది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది డాక్యుమెంట్లు అవసరం.
కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియ
[the_ad id=”4846″]
🔹అడ్రస్ ప్రూఫ్: ఆధార్ కార్డు, ఓటరు కార్డు వంటి ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి అడ్రస్
🔹ఐడెంటిటీ కార్డు: కుటుంబ యజమాని ఐడెంటిటీ కార్డు (ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ వంటివి)
🔹 డేట్ ఆఫ్ బర్త్ వివరాలు
🔹 యజమాని ఫోటో
🔹 యజమాని వయస్సు ధృవీకరణ పత్రం
🔹 యజమాని ఆదాయ వివరాలు. గ్రామీణ ప్రాంతాల వారైతే 1,60,000, పట్టణ ప్రాంతాలవారైతే 2,00,000 మించకూడదు.
[the_ad id=”4846″]
దగ్గరలోని మీసేవా కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పైన పేర్కొన్న డాక్యుమెంట్లతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలి. 👉మీసేవలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక దరఖాస్తుదారులకు నెంబర్ కేటాయిస్తారు.
[the_ad id=”4846″]
మీ సేవా ఇచ్చే దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన జిరాక్స్ పత్రాలను అటాచ్ చేసి ఎమ్మార్వో ఆఫీసులో సమర్పించాలి. ఎమ్మార్వో కార్యాలయం పరిశీలించి నిబంధనలకు లోబడి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు.
[the_ad id=”4846″]
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
