మొదటి రోజు ‘బీష్మ’ రికార్డు కలెక్షన్స్..!

యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా నటించిన తాజా సినిమా ‘బీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల అయ్యింది. విడుదలైన మొదటి ఆట నుండే హిట్ టాక్ సాధించిన ‘బీష్మ’ సినిమా మొదటి రోజు మంచి వసూళ్లు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో బీష్మ జోరు కొనసాగింది. రెండు రాష్ట్రాలలో కలపి 6.4 కోట్ల షేర్ రాబట్టింది. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని నితిన్ నటించిన ఈ సినిమా విజయవంతం కావడం పట్ల అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
