Hyderabad: సప్లిమెంటరీ అయినా పాస్ అయ్యేలా చదువుకోరా అని తల్లి గద్దించింది.. అంతే.

సైదాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతిలో ఫెయిల్ అయిన రిషి, సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని తల్లి సూచించినా, వీడియో గేమ్స్ ఆడుతూ, టీవీ చూస్తూ నిర్లక్ష్యం ప్రదర్శించాడు. తల్లి మందలింపు తన భవిష్యత్తు కోసం వచ్చిన ప్రేమతోనని అర్థం చేసుకోలేకపోయిన రిషి, అపార్ట్మెంట్ పైకి వెళ్లి ఉరేసుకున్నాడు.
వీడియో గేమ్ ఆడుతూ, టీవీ చూస్తూ సరిగా చదవడం లేదని కొడుకును తల్లి మందలిం చింది. ఆ మందలింపు వెనుక ఉన్నది తన భవిష్యత్తుపై ఆమెకున్న బెంగ మాత్రమే అని అర్థం చేసుకోలేకపోయిన ఆ విద్యార్థి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
