చిరు 152 లో : 26 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్ తో కలిసి నటించనున్న మెగా స్టార్

chiru

Teluguwonders:

🌟 చిరంజీవి 152వ సినిమా :

ప్రస్తుతం సైరా రిలీజ్ కి టైం దగ్గరపడింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత ఆ సినిమాకి సంబంధించి చిరంజీవికి ప్రమోషనల్ వర్క్ చాలా ఉంటుంది. తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియాకి సైతం ఇంటర్వూస్ ఇవ్వాలి. అక్కడికి, ఇక్కడికి తిరుగుతూ ఉండాలి. అనేక TV షోస్‌లో కూడా పార్టిసిపేట్ చెయ్యాలి. అలాగే సినిమా రిలీజ్ అయ్యాక కూడా దానికి సంబందించిన హ్యాంగ్ ఓవర్ మొత్తం వదిలించుకుని అప్పుడు నెక్స్ట్ సినిమా స్టార్ట్ చెయ్యాలి.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా రిలీజ్‌కి సిద్దమయింది. దీంతో చిరు తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. చిరు 152 వ సినిమా మొదలుపెట్టడానికి టైం ఫిక్స్ అయ్యింది.

💥కొరటాల శివతో మెగాస్టార్ సినిమా :

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, చాలా కష్టపడి ఇష్టంగా చేసిన సినిమా ‘సై‌రా’. ఈ సినిమా వర్క్ మొత్తం పూర్తయిపోయింది. దీంతో తన తదుపరి సినిమాకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు చిరంజీవి.సోషల్ కాజ్‌కి కమర్షియాలిటీ అద్ది అద్భుతమయిన సినిమాలు తెరకెక్కిస్తున్న కొరటాల శివతో మెగాస్టార్ సినిమా ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. కొరటాల కూడా చిరంజీవితో చాలా కాలం ట్రావెల్ చేసి బౌండెడ్ అండ్ ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లడమే తరువాయి. కానీ దాని గురించి ఇప్పటివరకు ఊహాగానాలే తప్ప వేరే ఏ అప్డేట్ కూడా లేదు. కానీ ఆ సినిమా షూటింగ్ సంబందించిన అప్డేట్స్ ఇప్పుడు తెలిసాయి.

ఈ సినిమాకోసం చిరు ఆల్రెడీ తన ఫిజిక్ కూడా మార్చుకుని సన్నగా తయారయ్యారు. ఈ సినిమాలో ఆయన రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు అని ఆల్రెడీ టాక్ నడించింది. ఈ సినిమాకి సంబంధించి ఇంకా హీరోయిన్స్ ఫైనల్ అవ్వలేదు. ఇప్పటికే ఇలియానా, నయనతార, అనుష్క, శృతి హాసన్‌ల పేర్లు వినిపించాయి. వీళ్ళలో నయనతార, శృతి హాసన్‌లు ఫైనల్ అయ్యే ఛాన్సులే ఎక్కువగా ఉన్నాయి. కొరటాల నిర్ణయాన్ని బట్టి హీరోయిన్స్‌ని కూడా ఫైనల్ చేస్తారు. సైరా రిలీజ్ అయ్యాక ఈ సినిమా విషయాలన్నీ కూడా అఫీషియల్ గా రివీల్ చేస్తారు 🎊26 ఏళ్ళ తర్వాత విజయ శాంతి తో ; మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి ఈ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించబోతుంది. మెకానిక్‌అల్లుడు సినిమాలో చివరిసారిగా కలిసి కనిపించిన ఈ హిట్ పెయిర్ మళ్ళీ 26 సంవత్సరాల తరువాత ఒకే ఫ్రేమ్‌లో మళ్ళీ కలిసి కనిపిస్తారు అనే మాట చాలా ఎక్సయిటింగ్‌గా ఉంది.

🔴ముహూర్తం ఫిక్స్ :

సైరా ప్రమోషన్స్ వల్ల ఈ క్రేజీ సినిమా నవంబర్‌కి షిఫ్ట్ అయ్యింది. నవంబర్ 3 న చిరు-కొరటాల సినిమా ముహూర్తం ఉంటుంది.ఆ తరువాత కాస్త గ్యాప్ ఇచ్చి నవంబర్ 10 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. కొరటాల సినిమాని కాస్త త్వరగానే ఫినిష్ చేస్తాడు కాబట్టి ఈ మెగా మూవీ 2020 సమ్మర్ ఎండింగ్‌లో లేదా, దసరాకి రిలీజ్ అవుతుంది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights