IND vs AUS : భారత్‌తో వన్డే సిరీస్ మొదలుకాక ముందే ఆస్ట్రేలియాకు షాక్.. గాయంతో సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్

cameron-green-ruled-out

భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కావడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ కేమరూన్ గ్రీన్ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్ మొత్తం నుంచి వైదొలిగాడు. కండరాల పట్టేయడం కారణంగా అతడు ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే, అతడి స్థానంలో మరొక స్టార్ బ్యాట్స్‌మెన్ మార్నస్ లబుషేన్‎కు ఆస్ట్రేలియా వన్డే జట్టులో చోటు దక్కింది.

IND vs AUS : భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కావడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ కేమరూన్ గ్రీన్ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్ మొత్తం నుంచి వైదొలిగాడు. కండరాల పట్టేయడం కారణంగా అతడు ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే, అతడి స్థానంలో మరొక స్టార్ బ్యాట్స్‌మెన్ మార్నస్ లబుషేన్‎కు ఆస్ట్రేలియా వన్డే జట్టులో చోటు దక్కింది. కేమరూన్ గ్రీన్ కండరాల పట్టేయడం కారణంగా భారత్‌తో జరిగే ఈ వన్డే సిరీస్‌కు దూరం అయ్యాడు. ఈ నిర్ణయం వెనుక ముఖ్య కారణం ఏమిటంటే.. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‎కు ముందు సెలక్టర్లు ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఆస్ట్రేలియా టీం ఒక ప్రకటనలో.. “కేమరూన్ గ్రీన్ కొంతకాలం రిహాబిలిటేషన్ పూర్తి చేస్తాడు. ఆ తర్వాత యాషెస్ సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు షెఫీల్డ్ షీల్డ్ మూడవ రౌండ్‌లో ఆడటానికి ప్రయత్నిస్తాడు” అని తెలిపింది.

కేమరూన్ గ్రీన్ స్థానంలో ఆస్ట్రేలియా వన్డే జట్టులో మార్నస్ లబుషేన్ చోటు దక్కించుకున్నాడు. లబుషేన్ గురువారం క్వీన్స్‌లాండ్ తరఫున షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో 159 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దేశవాళీ సీజన్‌లో ఇది మార్నస్ లబుషేన్‌కు నాలుగవ సెంచరీ కావడం విశేషం. 31 ఏళ్ల లబుషేన్ ఇప్పటివరకు 66 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడి, 34.64 సగటు, 83.56 స్ట్రైక్ రేట్‌తో 1871 పరుగులు చేశాడు.

మార్నస్ లబుషేన్ భారత్‌పై కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతను భారత్‌పై ఇప్పటివరకు 15 వన్డే మ్యాచ్‌లు ఆడి, 13 ఇన్నింగ్స్‌లలో 474 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత ఏడాది 2023 ప్రపంచ కప్ ఫైనల్‌లో కూడా మార్నస్ లబుషేన్ 58 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి ఆస్ట్రేలియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దీంతో గ్రీన్ స్థానంలో లబుషేన్ రాక భారత జట్టుకు అంత తేలికైన విషయం కాదని తెలుస్తోంది.

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ షెడ్యూల్:

మొదటి వన్డే: అక్టోబర్ 19 (పెర్త్)

రెండవ వన్డే: అక్టోబర్ 23 (అడిలైడ్)

మూడవ వన్డే: అక్టోబర్ 25 (సిడ్నీ)

ఈ మూడు మ్యాచ్‌లు భారత సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. 8:30 గంటలకు టాస్ పడుతుంది.

భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (ఉప-కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.

ఆస్ట్రేలియా వన్డే జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ, కూపర్ కోనొలీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, మార్నస్ లబుషేన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచెల్ ఓవెన్, మాట్ రెన్‌షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, మాథ్యూ కునేమన్, జోష్ ఫిలిప్.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights