Video: ఇదేందిది.. పాక్ జట్టుకు చెంతకు ఆసియా కప్ ట్రోఫీ.. ఐసీసీ రూల్ ఏం చెబుతోందంటే?

ACC and ICC decision on trophy: టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏసీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నుంచి ఆసియా కప్ ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో సరికొత్త వివాదం నెలకొంది. ఒక జట్టు ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరిస్తే, అది ఎవరికి దక్కుతుంది?
ACC and ICC decision on trophy: ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్ తొమ్మిదోసారి ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్ గెలిచిన తర్వాత, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏసీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నుంచి ఆసియా కప్ ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించాడు. ఇది నాటకీయ మలుపుకు దారితీసింది. కొద్దిసేపు వేచి ఉన్న తర్వాత, నఖ్వీ తనతో ట్రోఫీని తీసుకుని వెళ్లిపోయాడు. ఇది కీలక ప్రశ్నను లేవనెత్తింది. ఒక జట్టు ట్రోఫీని అంగీకరించకపోతే ఎవరు దానిని నిలుపుకుంటారు? దీనికి ఏదైనా నియమం ఉందా? మొత్తం విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
ఫైనల్‌లో గెలిచిన జట్టు టైటిల్‌కు నిజమైన యజమాని అవుతుంది. అందువల్ల, ట్రోఫీ అధికారికంగా గెలిచిన జట్టుదే అవుతుంది. అయితే, ఏదైనా కారణం చేత, గెలిచిన జట్టు ట్రోఫీని అందుకోలేకపోతే.. అధికారికంగా టైటిల్‌ను కలిగి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రోఫీని మరే ఇతర జట్టుకు లేదా రన్నరప్‌కు ఇవ్వరు. కాబట్టి, ట్రోఫీ పూర్తిగా గెలిచిన జట్టుకే చెందుతుంది.
కారణం వివరించాలి..
ట్రోఫీని సురక్షితంగా ఉంచే బాధ్యత టోర్నమెంట్ నిర్వాహకులదే. ఆ తరువాత పరిస్థితులు సద్దుమణిగాక ట్రోఫీని గెలిచిన జట్టుకే తిరిగి ఇస్తారు. ట్రోఫీని అందుకోవడానికి నిరాకరించిన జట్టుపై ఐసీసీ నియమాల ప్రకారం ఎటువంటి చర్య తీసుకోవలసిన అవసరం లేదు. అయితే, ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం, ఇది ఆట స్ఫూర్తిని ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తారు.
అసలు మ్యాటర్ ఏంటంటే?
ఒక కెప్టెన్ ట్రోఫీని అంగీకరించడానికి నిరాకరిస్తే, అతను ఒక కారణాన్ని అందించాలి. టోర్నమెంట్ నిర్వాహకులు ఆ విషయాన్ని దర్యాప్తు చేస్తారు. అంటే ఆసియా కప్ సమయంలో జరిగిన మొత్తం సంఘటనను ఐసీసీ, ఏసీసీ సంయుక్తంగా దర్యాప్తు చేయవచ్చు. అలాంటి సందర్భంలో ఐసీసీ దాని నిబంధనల ప్రకారం జరిమానాలు కూడా విధించవచ్చు.
శిక్షకు నిబంధనలు..
కెప్టెన్ మొత్తం విషయంపై తన నిర్ణయాన్ని లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బీసీసీఐ ఈ విషయాన్ని ఐసీసీకి నివేదిస్తుంది. ఆ తర్వాత ఐసీసీ ఈ విషయాన్ని దర్యాప్తు చేసి, కెప్టెన్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడా లేదా అని నిర్ణయిస్తుంది. కెప్టెన్ నియమాలను ఉల్లంఘించినట్లయితే, తదనుగుణంగా చర్యలు తీసుకుంటారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
