Independence Day Celebrations 2025: కాసేపట్లో ఎర్రకోట వద్ద జాతీయ జెండా ఆవిష్కరించనున్న ప్రధాని

Independence Day Parade 2025 Live Updates : నవభారత్ ఇతివృత్తంతో 79వ స్వాతంత్య్ర వేడుకలను కేంద్రం నిర్వహిస్తోంది. మోదీ 12వ సారి ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ఆ తర్వాత జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
రాజ్‌ఘాట్ వద్ద మహాత్మ గాంధీకి మోదీ నివాళులు
ఢిల్లీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. కాసేపట్లో ఆయన ఎర్రకోట వద్ద జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ప్రధాని హోదాలో 12వ సారి మోదీ జాతీయ జెండా ఎగురవేయనున్నారు.
12వ సారి జెండా ఆవిష్కరించనున్న మోదీ
79వ స్వాతంత్య్ర వేడుకలకు ఎర్రకోట సిద్ధమైంది. నవభారత్ ఇతివృత్తంతో 79వ స్వాతంత్య్రం దినోత్సవాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ 12వ సారి జెండా ఎగురవేయనున్నారు. ఈ వేడుకల్లో 25 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 15 వేల మంది బలగాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
యావత్ భారతం 79వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటోంది. కాసేపట్లో ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ జాతీయ జెండా ఎగురవేయనున్నారు. నవభారత్ ఇతివృత్తంతో 79వ స్వాతంత్య్ర వేడుకలను కేంద్రం నిర్వహిస్తోంది. మోదీ 12వ సారి ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ఆ తర్వాత జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఈ వేడుకల్లో 25 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. 15 వేల మంది బలగాలతో భారీ భద్రతా ఏర్పాటు చేశారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
