గురిచూసి కొట్టిన ట్రంప్ సర్కార్.. గ్రీన్ కార్డు లాటరీకీ భారతీయులకు నో ఛాన్స్!

అమెరికా మరో భారీ షాక్ ఇచ్చింది. డైవర్సిటీ వీసా (DV) లాటరీకి భారతీయులను అనర్హులుగా అమెరికా తాజాగా ప్రకటించింది. 2028 వరకు అమెరికా డైవర్సిటీ వీసా (DV) లాటరీ నుంచి భారతీయ పౌరులను మినహాయిస్తూ ప్రకటన వెలువరించింది. గ్రీన్ కార్డ్ లాటరీగా పిలిచే ఈ వీసాకు గత ఐదేళ్లుగా అమెరికాకు..
భారతీయులకు అమెరికా మరో భారీ షాక్ ఇచ్చింది. డైవర్సిటీ వీసా (DV) లాటరీకి భారతీయులను అనర్హులుగా అమెరికా తాజాగా ప్రకటించింది. 2028 వరకు అమెరికా డైవర్సిటీ వీసా (DV) లాటరీ నుంచి భారతీయ పౌరులను మినహాయిస్తూ ప్రకటన వెలువరించింది. గ్రీన్ కార్డ్ లాటరీగా పిలిచే ఈ వీసాకు గత ఐదేళ్లుగా అమెరికాకు తక్కువ వలస రేట్లు ఉన్న దేశాల నుంచి దరఖాస్తుదారులను ఎంపిక చేయడంపై దృష్టి పెట్టింది. తద్వారా అమెరికా వలస జనాభా వైవిధ్యంపై సారుప్యత ఏర్పడుతుందని భావిస్తుంది. నవంబర్ వీసా బులెటిన్ ప్రకారం.. 2026 సంవత్సరానికి DV లాటరీకి అర్హత సాధించని దేశాల్లో.. భారత్‌తోపాటు చైనా, దక్షిణ కొరియా, కెనడా, పాకిస్తాన్ కూడా ఉన్నాయి.
గత ఐదేళ్లలో 50 వేల కంటే తక్కువ వలసదారులను పంపిన దేశాల పౌరులను మాత్రమే అమెరికా వీసాలకు అనుమతిస్తుంది. అయితే యేళ్లుగా భారత్ నుంచి అమెరికాకు అధిక వలసలు వస్తున్నాయి. ఇది వీసా అర్హత పరిమితిని మించిపోయింది. దీంతో భారత్‌ను లాటరీకి అనర్హులను చేసింది. సాధారణంగా వలస రేటు తక్కువగా ఉన్న దేశాల నుంచి ఏడాదికి 55 వేల వరకు వలసదారులను అమెరికా అనుమతిస్తుంది. తాజా బులెటిన్ ప్రకారం.. అమెరికాకు వలసలు తక్కువగా ఉన్న దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్, బహ్రెయిన్, భూటాన్, బర్మా, కంబోడియా, ఇండోనేషియా, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జపాన్, జోర్డాన్, కువైట్, లావోస్, లెబనాన్, మలేషియా, నేపాల్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, శ్రీలంక, సిరియా, తైవాన్, థాయిలాండ్, తైమూర్-లెస్టే, యూఏఈ , యెమెన్ వంటి దేశాలను జాబితాలో చేర్చింది. అర్హత కలిగిన దేశాలకు వీసా కేటాయింపుల వివరాలను బుధవారం ప్రకటించింది. ఇప్పటి వరకు సుమారు 129,516 మంది ఇమ్మిగ్రేషన్ వీసాకు నమోదు చేసుకున్నారు.
2021లో 93,450 మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లారు. 2022లో ఈ సంఖ్య 1,27,010గా ఉంది. దక్షిణ అమెరికా 99,030, ఆఫ్రికన్ 89,570, యూరోపియన్ 75,610 వలసదారుల మొత్తం సంఖ్య కంటే ఇది చాలా ఎక్కువ. 2023లో 78,070 మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లారు. ఈ గరిష్ఠ వలసల నేపథ్యంలో అమెరికా స్వయంచాలకంగా 2028 వరకు భారతీయులను DV లాటరీలకు అనర్హులుగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వలసల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అమెరికాకు వెళ్లి అన్ని మార్గాలు మూసుకుపోతుండటంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. తొలుత స్టూడెంట్ వీసాల పట్ల కఠినమైన విధానాన్ని అవలంబించింది. సోషల్ మీడియాపై ఆంక్షలు, స్క్రీనింగ్‌ను విస్తరించడం వంటి వరుస చర్యలకు పాల్పడింది. ఇక హెచ్1 బీ వీసాలపై కూడా కఠిన ఆంక్షలు విధించింది. H-1B వీసాదారులలో 70 శాతానికి పైగా భారత్ వాటా ఉండటం విశేషం.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
