ఇన్‌స్టాగ్రామ్ రింగ్ అవార్డ్! ఎవరికి ఇస్తారు? ఏంటి దీని ప్రత్యేకత.. పూర్తి వివరాలు!

ఇన్‌స్టాగ్రామ్ తన క్రియేటర్ల కోసం ‘రింగ్స్ అవార్డు’ను ప్రకటించింది, ఇది భౌతిక బహుమతిపై దృష్టి పెడుతుంది. 25 మంది విజేతలకు గ్రేస్ వేల్స్ బోన్నర్ రూపొందించిన ప్రత్యేక ఉంగరాలు లభిస్తాయి. నగదు బహుమతి లేనప్పటికీ, విజేతలు తమ ప్రొఫైల్ రంగును మార్చుకోవడంతో సహా ప్రత్యేక డిజిటల్ ప్రయోజనాలను పొందుతారు.
ఇన్‌స్టాగ్రామ్ తన క్రియేటర్ల కోసం రింగ్స్ అవార్డు తీసుకొచ్చింది. సెలబ్రిటీలు నిర్వహించే కార్యక్రమానికి బదులుగా ఈ అవార్డు ఒక ప్రత్యేకమైన భౌతిక బహుమతిపై దృష్టి పెడుతుంది. 25 మంది విజేతలు గ్రేస్ వేల్స్ బోన్నర్ రూపొందించిన ప్రత్యేక ఉంగరాలను అందుకుంటారు.
విజేతలకు ఎటువంటి నగదు ఇవ్వరు. అయితే వారు తమ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్, స్టోరీస్‌లో ప్రదర్శించడానికి అవార్డు డిజిటల్ ప్రతిరూపాన్ని అందుకుంటారు. రింగ్ గెలుచుకున్న క్రియేటర్లు మరన్ని ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. వారి ప్రొఫైల్ కలర్ మార్చుకోవచ్చు. ఈ ఫీచర్ ప్లాట్‌ఫామ్‌కు ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ ఇంతకు ముందు ఈ స్థాయి ప్రొఫైల్ ఛేంజెస్‌ను అనుమతించలేదు. మైస్పేస్, ఫ్రెండ్‌స్టర్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు రెండు దశాబ్దాల క్రితం ఇలాంటి ఫీచర్లు అందించాయి.
ఎంపిక ప్రక్రియ
ఈ అవార్డులు ఇతర వేడుకల మాదిరిగా అధికారిక వర్గాలపై ఆధారపడి ఉండవు. బదులుగా 25 మంది విజేతలను విస్తృత శ్రేణి అంశాలు, ఆసక్తి సమూహాల నుండి ఎంపిక చేస్తారు. ప్రమాణాలు చాలా కఠినంగా ఉంటాయని తెలుస్తోంది.
ఎంపిక జ్యూరీ, ఫలితాల తేదీ
సెలక్షన్ జ్యూరీలో రింగ్ డిజైనర్ గ్రేస్ వేల్స్ బోన్నర్, ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి, యూట్యూబ్ పర్సనాలిటీ MKBHD, నటి యారా షాహిది, స్పైక్ లీ, మార్క్ జాకబ్స్, కావ్స్, పాట్ మెక్‌గ్రాత్, సెడ్రిక్ గ్రోలెట్, ఇలోనా మహర్, టైనీ, మురాద్ ఒస్మాన్, ఎవా చెన్ వంటి వారు ఉన్నారు. వారు తుది విజేతలను నిర్ణయించే ముందు ఫీల్డ్‌ను వేల నుండి వందలకు తగ్గిస్తారు. విజేతలను అక్టోబర్ 16న ప్రకటించనున్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
